BalaKrishna Fans say Manasu Venna
Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలతో దుమ్ము రేపుతున్నాడు. ఆయన ఇటీవల నటించిన అఖండ చిత్రం పెద్ద హిట్ కాగా, ఓటీటీ షో అన్‌స్టాపబుల్ రికార్డులు చెరిపేస్తుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు బాలయ్య. అయితే కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన లెజెండ్ చిత్రానికి సీక్వెల్ పనులు మొదలయ్యాయని తెలుస్తుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా లెజెండ్. 2014లో విడుదలైన ఈ సినిమా 2017 వరకు థియేటర్లో ఆడింది.
నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా.. రాయలసీమలోని ఎమ్మిగనూరులో ఒక థియేటర్లో వెయ్యి రోజులకు పైగా లెజెండ్ సినిమా ఆడింది. ఈ సినిమా 1000 రోజుల పోస్టర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌పై ఆసక్తికర వార్త హల్చల్ చేస్తుంది.బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీతో చేస్తోన్న సినిమా తర్వాత వెంటనే అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది.. అది పూర్తయిన వెంటనే బాలయ్య – బోయపాటి సినిమా తెరకెక్కనుంది. పొలిటికల్ సెటైర్లు, పంచ్‌లతో ఈ సినిమా కథ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య నోట లెజెండ్‌లో ఎలాంటి పవర్ ఫుల్ డైలాగులు పేలాయో ఈ సినిమాలోనూ అంతే పవర్ ఫుల్ డైలాగులు ఉంటాయని తెలుస్తోంది.
Balakrishna legend 2 sequel starts soon
ఓ విధంగా చెప్పాలంటే లెజెండ్ రేంజ్‌లో అంటే లెజెండ్ 2 అనుకోవచ్చని అంటున్నారు. బోయపాటికి కథలో పొలిటికల్ లైన్‌ను ఎలా కలపాలో బాగా తెలుసు.ఈ సినిమాను వచ్చే మార్చి నుంచి పట్టాలెక్కిస్తారని.. ఏపీలో ఎన్నికల మూమెంట్‌ను బట్టి కాస్త ముందుగానే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా అఖండ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తారని టాక్. ఇక ప్రస్తుతం బాలకృష్ణ తన 107వ సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం పోషించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్‌లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
This website uses cookies.