Balakrishna : లెజెండ్ సీక్వెల్ ముహూర్తం ఫిక్స్… బాల‌కృష్ణ ఫ్యాన్స్‌కి పూన‌కాలే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : లెజెండ్ సీక్వెల్ ముహూర్తం ఫిక్స్… బాల‌కృష్ణ ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :14 May 2022,4:30 pm

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు టీవీ షోల‌తో దుమ్ము రేపుతున్నాడు. ఆయ‌న ఇటీవ‌ల న‌టించిన అఖండ చిత్రం పెద్ద హిట్ కాగా, ఓటీటీ షో అన్‌స్టాప‌బుల్ రికార్డులు చెరిపేస్తుంది. ఇక ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు బాల‌య్య‌. అయితే కెరీర్‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన లెజెండ్ చిత్రానికి సీక్వెల్ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా లెజెండ్. 2014లో విడుదలైన ఈ సినిమా 2017 వరకు థియేటర్లో ఆడింది.

నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపించినా.. రాయలసీమలోని ఎమ్మిగనూరులో ఒక థియేటర్లో వెయ్యి రోజులకు పైగా లెజెండ్ సినిమా ఆడింది. ఈ సినిమా 1000 రోజుల పోస్టర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌పై ఆస‌క్తికర వార్త హ‌ల్చ‌ల్ చేస్తుంది.బాల‌య్య ప్ర‌స్తుతం మ‌లినేని గోపీతో చేస్తోన్న సినిమా త‌ర్వాత వెంట‌నే అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది.. అది పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య – బోయ‌పాటి సినిమా తెర‌కెక్క‌నుంది. పొలిటిక‌ల్ సెటైర్లు, పంచ్‌ల‌తో ఈ సినిమా క‌థ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. బాల‌య్య నోట లెజెండ్‌లో ఎలాంటి ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు పేలాయో ఈ సినిమాలోనూ అంతే ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు ఉంటాయ‌ని తెలుస్తోంది.

Balakrishna legend 2 sequel starts soon

Balakrishna legend 2 sequel starts soon

Balakrishna : లెజెండ్ వ‌స్తే పూన‌కాలే..!

ఓ విధంగా చెప్పాలంటే లెజెండ్ రేంజ్‌లో అంటే లెజెండ్ 2 అనుకోవ‌చ్చ‌ని అంటున్నారు. బోయ‌పాటికి క‌థ‌లో పొలిటిక‌ల్ లైన్‌ను ఎలా క‌ల‌పాలో బాగా తెలుసు.ఈ సినిమాను వ‌చ్చే మార్చి నుంచి ప‌ట్టాలెక్కిస్తార‌ని.. ఏపీలో ఎన్నిక‌ల మూమెంట్‌ను బ‌ట్టి కాస్త ముందుగానే రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా అఖండ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తార‌ని టాక్. ఇక ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న 107వ సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమాలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం పోషించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది