Balakrishna : రాజమౌళి బాలకృష్ణ కాంబినేషన్లో ఈ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్స్… ఆ సినిమాలే బాలకృష్ణ చేసి ఉంటే..!
Balakrishna : ఇద్దరు దిగ్గజాలే. భారీ సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న వారే. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, దర్శకధీరుడు రాజమౌళిలకు ఎంత పేరుందో.. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి చిత్రాల కోసం అభిమానులు ఎంతగానం ఎదురు చేస్తారో మాట్లాడుకోనవసరం లేదు. ఇక వీరిద్దరూ కలిస్తే.. కలిసి ఓ సినిమా చేస్తే.. అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించగలమా..? ఆ మూవీ మనకు అంచనాలకు మించి హిట్ అవ్వడం, భారీ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేసే కాంబినేషన్ వీరిద్దరిదని బల్ల గుద్ది చెప్పవచ్చు. అయితే గతంలో రెండు సార్లు ఈ దర్శక ధీరుడు బాలయ్య బాబుకు కథ వినిపించాడట. కానీ ఏవో కారణాల వల్ల ఆ మూవీ పట్టలెక్కలేదట. అదే గనుక జరిగితే ఆ సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేవే.
అయితే బాలయ్య వద్దనుకున్న ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. అవేంటో చూద్దాం రండి.రాజమౌళి కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమాలు సింహాద్రి, మగధీర. జూ. ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సింహాద్రి చిత్ర కథను ఆయన ముందుగా బాలయ్యకే చెప్పారట. అయితే ఆ సమయంలో బాలకృష్ణ పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉండడంతో ఆయన ఆ అవకాశాన్ని ఛాన్స్ మిస్ చేసుకోవాల్సి వచ్చిందట. అప్పటికి రాజమౌళి ఒక్క సినిమా మాత్రమే చేయడం.. బీ గోపాల్ తో ఆయనది హిట్ కాంబినేషన్ అవ్వడం తో ఆయన సింహాద్రి కథను వదిలి.. పలనాటి బ్రహ్మ నాయుడుకే ఒకే చెప్పారట. అనంతరం వరుస హిట్ లు సొంతం చేసుకుని టాప్ డైరెక్టర్ గా పేరొందిన రాజమౌళి ఆ తర్వాత మగధీర సినిమా స్టోరీ లైన్ ను కూడా ముందుగా బాలయ్యకే చెప్పారట.
Balakrishna : సింహాద్రి, మగధీర చిత్రాలను మిస్ చేసుకున్న బాలయ్య..!
అయితే ఏవో కారణాల వల్ల ఆ సినిమా కాస్త మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వెళ్లి ఆయనను టాప్ హీరోను చేసింది.అలా వీరిద్దరి కాంబినేషన్లో రావల్సిన ఈ రెండు సూపర్ హిట్ సినిమాలు చేజారినట్లు.. బాలయ్యే స్వయంగా అన్‌స్టాపబుల్ షో లో బయటపెట్టారు. అయితే ఇప్పుడు రాజమౌళి తో కలిసి మూవీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని బాలయ్య తన మనసులో మాటను చెప్పేశారు. మరి భవిష్యత్తులో అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందేమో వేచి చూడాలి. బాలయ్య అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సంతోషంలో మునిగి తేలుతుండగా.. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది.