Mahesh Babu vs Rajamouli : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మహేష్ బాబు vs రాజమౌళి ఫైట్.. వార‌ణాసి కోస‌మా ఏంది.. వీడియో ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 24 February 2026, 8:00 pm
  •  Mahesh Babu vs Rajamouli : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మహేష్ బాబు vs రాజమౌళి ఫైట్.. వార‌ణాసి కోస‌మా ఏంది..?

Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. అందులో ఏముందో తెలుసా? మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒకరినొకరు కాలర్ పట్టుకుని రఫ్ ఆడుకుంటున్నారు. కంగారు పడకండి.. ఇది నిజంగా జరిగింది కాదు, పక్కా AI మాయాజాలం. ఈ వీడియో చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక కాఫీ షాప్‌లో గడ్డంతో ఉన్న స్టైలిష్ మహేష్, రాజమౌళితో సీరియస్‌గా గొడవపడుతున్న సీన్ ఇది. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ అగ్రెసివ్‌గా కొట్టుకుంటుంటే, బ్యాక్‌గ్రౌండ్‌లో జనాలు షాక్ అవుతూ చూస్తున్నారు.

Mahesh Babu vs Rajamouli : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మహేష్ బాబు vs రాజమౌళి ఫైట్.. వార‌ణాసి కోస‌మా ఏంది.. వీడియో ?

Mahesh Babu vs Rajamouli : సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న మహేష్ బాబు vs రాజమౌళి ఫైట్.. వార‌ణాసి కోస‌మా ఏంది.. వీడియో ?

Mahesh Babu vs Rajamouli  : ఏంటీ Seedance 2.0?

అసలు అది గ్రాఫిక్స్ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత రియలిస్టిక్‌గా ఉంది.ఈ అద్భుతాన్ని సృష్టించింది Seedance 2.0 అనే ఒక క్రేజీ AI టూల్. బైట్‌డ్యాన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఈ టూల్, మనం ఇచ్చే చిన్న టెక్స్ట్ మెసేజ్‌తో హాలీవుడ్ రేంజ్ వీడియోలను పుట్టించేస్తోంది.

అందుకే ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా “సినిమా ఈజ్ డెడ్” అనే రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు.ఇకపై ఫ్యాన్-మేడ్ వీడియోలు, సినిమా సీన్లు ముందే చూసుకోవడం చాలా ఈజీ అయిపోనుంది.
టెక్నాలజీ ఇంతలా పెరిగిపోతుంటే ఒక పక్క భలే ఉందనిపిస్తున్నా, మరోపక్క అసలైన నటుల పరిస్థితి ఏంటా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా మహేష్-రాజమౌళిల ఈ ‘ఏఐ ఫైట్’ మాత్రం నెక్స్ట్ లెవల్ .

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp