Balakrishna : పాపం బాలయ్య వాడేస్తున్నారు.. వంద కోట్ల హీరో అయినా మంచితనం వల్ల నష్టం

Advertisement

Balakrishna : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గత కొన్ని సంవత్సరాల నుండి ఒక్కొక్క సినిమా కు 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. ఈ మధ్య కాలం లో ప్రభాస్ తన ప్రతి సినిమా కి కూడా రూ. 100 కోట్ల కు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కూడా దాదాపుగా వంద కోట్ల రెమ్యూనరేషన్ దక్కించుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.

Balakrishna remuneration interesting update
Balakrishna remuneration interesting update

ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచి 70 నుండి 80 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నాడు అనేది టాక్. ఇంత మంది ఇన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ తన రెమ్యూనరేషన్ విషయంలో వార్తల్లో ఉండడం లేదు. ఒక సినిమా హిట్ అయితే నిర్మాతలే చూసి ఐదు పది కోట్ల రూపాయలు ఆయనకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాప్‌ అయితే అంతకు ముందు రెమ్యూనరేషన్ ని తిరిగి ఇస్తారు.

Advertisement
Balakrishna remuneration interesting update
Balakrishna remuneration interesting update

అంతే కానీ బాలకృష్ణ ఎప్పుడూ కూడా రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను డిమాండ్ చేసిందే లేదు, వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేస్తున్నా కూడా బాలకృష్ణ ఇప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేయకపోవడం ఆయన మంచితనానికి నిదర్శనం అనడంలో సందేహం లేదు. ఆయన మంచితనాన్ని నిర్మాతలు వాడేసుకుంటున్నారు, ఆయనతో మంచిగా ఉండి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలు చేయించుకుంటున్నారు. కొంత మంది ఆయనకు రెమ్యూనరేషన్ సగం అంతకు తక్కువ ఇచ్చి కూడా విషయం ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ ఉంటుంది.

Advertisement
Advertisement