Vijay Thalapathy : ఏంటి తమిళ స్టార్ హీరో విజయ్ ఆస్తి అంత ఉందా..!!
Vijay Thalapathy : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అటు తమిళనాడు ఇటు తెలుగు రాష్ట్రాల వారిని తన సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమాకి 100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నాడు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్ర శేఖర్. 1984 లో తన తండ్రి SA చంద్రశేఖర్ సినిమా `వెట్రి`తో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ప్రారంభించాడు. అతను చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 7 చిత్రాలలో నటించాడు. రజనీకాంత్ తో `నాన్ సిగప్పు మనితన్` సినిమాలో కూడా నటించాడు.
విజయ్ హీరో గా మొదట నటించిన సినిమా నాలయ్య తీర్పు . ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విక్రమన్ డైరెక్ట్ చేసిన పూవే ఉనక్క సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం సౌత్ లోనే స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. అలాగే భారతీయ సినీ పరిశ్రమలోని అత్యంత సంపన్నుడైన నటుడిగా విజయ్ దళపతి ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ నికర ఆస్తి 445 కోట్లు. సంవత్సరానికి రూ.120 నుండి 150 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడుగా రికార్డులకెక్కాడు విజయ్.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘ బీస్ట్ ‘ సినిమాకి100 కోట్ల పారితోషికం వసూలు చేశాడు. ఆ తరువాత వచ్చిన వారిసూ సినిమాకి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. దళపతి విజయ్ తన భార్య సంగీత సోర్నలింగం, ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్ – దివ్య షాషాతో కలిసి విలాసవంతమైన సముద్రతీర బంగ్లాలో నివసిస్తున్నారు. ఇల్లు చెన్నై లోని నీలంకరై పరిసరాల్లోని క్యాజురినా డ్రైవ్ వీధిలో ఉంది. ఇంగ్లాండ్ నుండి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఉంది. వీటితో పాటు నాలుగు ఐదు కాస్ట్లీ కార్లను కలిగి ఉన్నాడు.