Bala Krishna : బాలయ్య హోస్ట్‌గా ఆహా వేదికగా ప్రసారం అవుతున్నషో అన్‌స్టాపబుల్ 2. తొలి సీజన్ మంచి పాపులారిటీ తెచ్చుకోవడంతో అదే ఊపుతో రెండో సీన్ కూడా మొదలు పెట్టారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొలి షోతోనే రికార్డులు చేస్తూ మరోసారి సత్తా చాటారు బాలకృష్ణ. తనదైన మాటలతో ప్రేక్షకులను హూషారెత్తించడమే గాక ఈ సీజన్ పై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. సదా నన్ను కోరుకునే మీ అభిమానం అన్‌స్టాపబుల్‌ని స్టార్ షోలకి అమ్మా మొగుడుగా చేసింది అంటూ కిక్కిచ్చే డైలాగ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ తనదైన మ్యానరిజంలో హోస్టింగ్ చేసిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దీంతో ఎవరూ ఊహించని రీతిలో మొదటి సీజన్‌లో ప్రతి ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేష్‌లు ఫస్ట్ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. దీంతో ఫస్ట్ ఎపిసోడ్‌కు అదిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ ఎపిసోడ్‌లో కొన్ని పొలిటికల్ టాపిక్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టించాయి. అయినా తనదైన శైలిలోచలాకీగా ప్రశ్నలు వేస్తూ, వారి నుంచి చిలిపిగా సమాధానాలు రాబడుతూ.. బాబు అండ్ లోకేష్‌లతో కలిసి బాలయ్య చేసిన వినోదం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ రెండో సీజన్ అనుకున్న దానికంటే గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. రెండో ఎపిసోడ్ కోసం ఏకంగా ఇద్దరు యువ హీరోలను బాలయ్య ముందుకు తీసుకొస్తున్నారు.
డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో పాటు మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ లను ఇంటర్వ్యూ చేశారు బాలయ్య బాబు. ఇక అన్‌స్టాపబుల్ 2 మూడో ఎపిసోడ్లో రమ్యకృష్ణ, రాశీ ఖన్నాల సందడి చూడబోతున్నామనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఈ వీకెండ్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య బాబు హంగామా మామూలుగా ఉండదని అంటున్నారు. ఓ ఎపిసోడ్ కి రోజా ని కూడా గెస్ట్ గా పిలవాలని బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏపీ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి బాలయ్య రోజా తో చర్చించాలని బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఇది సాధ్యమా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా రోజా గతంలో బాలయ్యతో కలిసి పలు హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.