Ariselu Recipe : మన తెలుగువారి ఇళ్లలో పండుగ వచ్చిందంటే అరిసెలు తప్పనిసరిగా చేస్తారు. అరిసెలు చేయడానికి పెద్ద ప్రాసెస్ నే ఉంటుంది. బియ్యం కడగాలి, ఆరబెట్టాలి, పాకం పట్టాలి, తడి బియ్యప్పిండితో అరిసెలను చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. అయితే పాకం లేకుండా తడిపిండి లేకుండా అప్పటికప్పుడు ఈజీగా అరిసెలు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే అరిసెలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి చేయటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి ఇంకెందుకు ఆలస్యం అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) బెల్లం 2) బియ్యం పిండి 3) గోధుమపిండి 4) నెయ్యి 5)ఆయిల్ 6) యాలకుల పొడి 7) నువ్వులు
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె లో ఒక కప్పు సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకుని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం వాటర్ ని ఒక పాన్ లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ నీళ్లని మరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మరిగితే సరిపోతుంది. ఈ నీళ్లు మరిగేలోపు ఒక గిన్నెలోకి ఒక కప్పు పొడి బియ్యప్పిండి వేసుకోవాలి. అరిసెలు మెత్తగా రావడం కోసం ఇందులో అరకప్పు గోధుమపిండి కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఐదు యాలకులను మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి కరిగాక కలుపుకొని ఒక కప్పు బియ్యప్పిండి, అర కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి.
మనం పిండి ఎంత తీసుకున్నామో నీళ్లు కూడా అంతే తీసుకోవాలి. మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని ముద్దగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల అరిసెలు నూనెలో వేసినప్పుడు ఈ నువ్వులు మొత్తం అరిసెల నుంచి విడిపోకుండా ఉంటాయి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే బట్టర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని అరిసెలు ఒత్తుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి బాగా కాగనివ్వాలి. పిండి కూడా కొంచెం వేడి తగ్గుతుంది. పిండి కన్సిస్టెన్సీ కొంచెం సాఫ్ట్ గా ఉండాలి. ఒకవేళ మీకు పొరపాటున గట్టిగా అయిందనుకోండి చేతిని కొంచెం తడుపుకుంటూ పిండిని కలుపుకుంటే పిండి సాఫ్ట్ గా అవుతుంది. ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కాని అద్దుకొని పిండిని అప్పలాగా వత్తుకోవాలి. వత్తుకొని కాగిన నూనెలోకి వేసేసుకోవాలి కాలిన తర్వాత ఒక ప్లేట్ పై తీసుకొని వత్తుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ అయినట్లే.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.