Balakrishna : పద్యంతో మందుబాబులను ఆకట్టుకున్న బాలకృష్ణ.. వీడియో వైరల్..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 17, 2022, 2:30 pm

Balakrishna : అన్ స్టాపబుల్ టాక్ షోతో వ్యాఖ్యాతగా మారిన బాలయ్య రేటింగ్స్ తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. గెస్టులను ఇరకాటంలో పెడుతూ.. ప్రశ్నలతో షో ను ఆధ్యంతం ఆసక్తికరంగా నడిపిస్తున్నారు బాలయ్య. వచ్చే సెలబ్రిటీ ఎంతటి వారైనా బాలయ్య ప్రశ్నలు అడిగే తీరులో మాత్రం తేడా ఉండటం లేదు. తాజాగా సంక్రాంతి స్పెషల్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో ‘లైగర్’ టీమ్ బాలయ్య షో లో సందడి చేసింది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఆ సినీ నిర్మాత ఛార్మి, హీరో విజయ్ దేవరకొండ ముగ్గురూ కలిసి బాలయ్య బాబుతో తమ దైన స్టైల్లో రచ్చ రచ్చ చేశారు. ఈ షో లో బాలయ్య మద్యం పై పాడిన ఓ పద్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో గతంలో బాలయ్య.. పైసా వసూల్ అనే సినిమా చేశారు.

ఇందులో మామా ఎక్ పెగ్‌లా అనే పాట అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సినిమాను గుర్తు చేసుకుంటూ మామా ఎక్ పెగ్ లా అని సింగేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలయ్య.. మద్యం ప్రియులను ఆకట్టుకుంటూ పద్యం రూపంలో ఆ పాటను పాడారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లైగర్ సినిమా గురించిన విషయాలతో ఎన్నో వ్యక్తిగత విషయాలను ఈ షోలో పంచుకున్నారు వీరంతా. ఇక మధ్య మధ్యలో బాలయ్య వేసిన జోకులకు.. అక్కడ ఉన్న ఆడియన్స్ అంత నవ్వుల్లో మునిగిపోయారు. ఇలా వీరి నలుగురి మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ప్రోమోనే ఇలా ఉంటే.. ఇంకా పూర్తి ఏపిసొడ్ లో వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదని అర్థం అవుతోంది.

Balakrishna sings a song on wine in unstoppable show

Balakrishna sings a song on wine in unstoppable show

Balakrishna : మద్యంపై పద్యం పాడిన బాలయ్య..:

ఇక పూర్తి ఎపిసోడ్ లో వీరి మధ్య ఏం సంభాషణ జరిగిందో..? బాలయ్య ఆ ముగ్గురిని ఇంకా ఏం ఏం ప్రశ్నలు అడిగారో అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.నంద‌మూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా భారీ విజయంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అనే టాక్ షో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా.. ఈ కార్యక్రమం కూడా రోజురోజుకు రికార్డులను సృష్టిస్తోంది. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లో ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా లైక్‌లు, వ్యూస్ తో ఈ షో ఇటీవలే సరికొత్త రికార్డును సృష్టించి అందరినీ అబ్బుర పరిచింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp