Balakrishna : ఒకే వేదిక‌పై జ‌గ‌న్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తీసుకురాబోతున్న బాల‌య్య‌.. స్కెచ్ మాములుగా లేదుగా..!

Authored By Sam C | The Telugu News | Updated on: December 21, 2022, 8:31 pm

Balakrishna : బాల‌కృష్ణ హోస్ట్‌గా దూసుకుపోతున్న పాపుల‌ర్ షో అన్‌స్టాప‌బుల్. ఈ కార్యక్రమం తొలి సీజన్ మంచి పాపులారిటీ ద‌క్కించుకోవ‌డంతో ఇప్పుడు రెండో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. గత సీజన్లో ఈ షో కేవలం ఎంటర్‌టైన్మెంట్ ప్రధానంగా సాగగా ఈసారి మాత్రం పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ని కూడా ఆహ్వానిస్తున్నారు.. ఈ సీజన్ మొదటి షోలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ గెస్ట్ లుగా హాజరు కాగా, అనంత‌రం ఓ ఎపిసోడ్‌లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి అన్ స్టాపబుల్ షోకి జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

2014లో ఏ విధమైన పదవి ఆశించకుండా టీడీపీకు నిండు మనస్సుతో మద్దతు తెలిపినందుకు పవన్ కళ్యాణ్‌కు ముందుగా బాలయ్య కృతజ్ఞతలు చెప్పనున్నాడనే టాక్ వినిపిస్తుండగా, ఈ షోలో 2019 ఎన్నికల్లో ఓటమి, తరువాత ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడని బాల‌య్య‌.. ప‌వ‌న్‌ని ప్ర‌శ్నించ‌నున్నాడ‌ట‌. చిరుతో కూడా మాట్ల‌డ‌డ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు జ‌గ‌న్ కూడా సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. జ‌గ‌న్ రాజ‌కీయాల‌లోకి రాక‌ముందు బాల‌య్యకి పెద్ద ఫ్యాన్. అప్ప‌ట్లో ఆయ‌న కోసం పెద్ద క‌టౌట్స్ కూడా ఏర్పాటు చేసేవాడు.

Balakrishna to Jagan Pawan Kalyan on Unstoppable Show stage

Balakrishna to Jagan Pawan Kalyan on Unstoppable Show stage

Balakrishna : ఇద్ద‌రు ఓకే వేదిక‌పై సాధ్య‌మేనా..!

కృష్ణ భౌతిక కాయాన్ని దర్శించుకోడానికి జగన్ వచ్చినప్పుడు బాలయ్య బాబు కూడా అక్కడే ఉండ‌డంతో ఇద్ద‌రు కాసేపు ప‌ల‌క‌రించుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఇప్ప‌టికీ మంచి సాన్నిహిత్యం ఉన్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్‌కి జ‌గ‌న్‌ని కూడా బాల‌య్య ఆహ్వానించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. .పవన్ కళ్యాణ్ మరియు జగన్ ని ఒకే వేదిక పై కూర్చోపెట్టి రాజకీయాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగబోతున్నారని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే నిజ‌మైతే చరిత్రలో ఎన్నడూ సంభవించని రికార్డులు క్రియేట్ కావ‌డం ఖాయం.

Sam C

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp