Home » Entertainment » Balakrishna Unstoppable Talk Show Stopped
Entertainment

Balakrishna : బ్రేకింగ్.. శాశ్వతంగా ఆగిపోయిన బాలయ్య – ఆహ షో.. అన్ స్టాపబుల్ ??

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 18, 2023 12:27 pm
Advertisement

Balakrishna : ప్రస్తుతం బాలయ్య రేంజ్ ఎలా ఉందో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే ఆహా ఓటీటీ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో తో బాలయ్యకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ క్రేజ్ తోనే వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో బాలయ్య క్రేజ్ మరింత పెరిగింది. బాలయ్య హోస్ట్ గా ఆహా మీడియాలో ప్రసారమవుతున్న ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రెండవ సీజన్ పూర్తి చేసుకున్న ఈ షో ఇకమీదట ఉండబోదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Balakrishna unstoppable talk show stopped

సీజన్ 1 గ్రాండ్ ఫినాలే లో బాలయ్య ఈ షో కు రెండవ సీజన్ కూడా ఉంటుంది త్వరలోనే మళ్లీ కలుసుకుందాం అని అన్నారు. కానీ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే లో ఇక సెలవు అని అర్థం వచ్చేటట్లుగా నా మదిలో ఈ జ్ఞాపకాలు చిరకాలం ఉంటాయి అని అన్నారు. అయితే దీని అర్థం తరువాతి సీజన్ లేదనేగా అని జనాలు అంటున్నారు. ఈ టాక్ షోలో బాలయ్య నేటి తరం హీరో, హీరోయిన్స్ తో చిట్ చాట్ చేశాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు వచ్చారు. అయితే వీళ్ళతోపాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు రావాల్సి ఉంది.

Advertisement

Balakrishna unstoppable talk show stopped

అలాగే బాలయ్య తరం హీరోలలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ రావాల్సి ఉంది. వీళ్ళందరితో సీజన్ 3 చేయవచ్చు. కానీ వీళ్లను సీజన్ 2 కే ఆహ్వానించారు. కానీ వీళ్లు పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. మళ్లీ వాళ్లని నమ్ముకొని సీజన్ 3 మొదలు పెట్టలేమని ఆహా మీడియా అభిప్రాయపడుతుందట. అందుకే సీజన్ 3 ఉండదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంతవరకు ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. జనాలు మాత్రం ఈ షో ఇక ఉండబోదని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ షోకు చాలామంది అభిమానులు ఉన్నారు. తరువాతి సీజన్ రావాలని కోరుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి