Sudigali Sudheer : సుధీర్ పెళ్లి మాదిరిగానే రష్మి గౌతమ్ పెళ్లి..!
Sudigali Sudheer : జబర్దస్త్ పేరు వినగానే ఎక్కువ మంది ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమ్ పేర్లు గుర్తుకొస్తాయి. జబర్దస్త్ కార్యక్రమం భారీ రేటింగ్ సొంతం చేసుకోవడానికి చమ్మక్ చంద్ర చీర కట్టడం ఒక ఎత్తు అయితే.. రష్మి గౌతమ్ తో సుధీర్ ప్రేమలో పడ్డట్లుగా పలు ఎపిసోడ్స్ తో సందడి చేయడం మరో ఎత్తు. ఒకానొక సమయంలో సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మీ గౌతం పెళ్లి చేసుకోబోతున్నారు, ప్రేమలో ఉన్నారు, వారిద్దరికీ ఇప్పటికే పెళ్లయింది అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ అదంతా ఆన్ స్క్రీన్ కోసమే ఆఫ్ స్క్రీన్ వారిద్దరు కనీసం స్నేహితులుగా కూడా కొనసాగడం లేదని ప్రచారం జరిగింది.
like sudigali sudheer marriage anchor Rashmi Gautam marriage completed
తాజాగా సుడిగాలి సుధీర్ యొక్క పెళ్లి 2014లోనే జరిగిందని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై సుడిగాలి సుదీర్ అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అయినా కూడా సుధీర్ ఇప్పటికే పెళ్లి చేసుకొని ఉంటాడని చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే సమయంలో రష్మీ గౌతమ్ కూడా పెళ్లి చేసుకుని ఉంటుందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. గతంలోనే ఒక సీనియర్ జర్నలిస్టు తన సోషల్ మీడియా పేజీలో రష్మి గౌతమ్ పెళ్లి అయ్యిందని పేర్కొన్నాడు.
like sudigali sudheer marriage anchor Rashmi Gautam marriage completed
బుల్లి తెరపై సక్సెస్ సాధించాలంటే పెళ్లి చేసుకున్న విషయం దాచి పెట్టాలని ఆమె భావిస్తుందని, అందుకే ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని ప్రకటించలేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల సుడిగాలి సుధీర్ యొక్క పెళ్లి విషయం బయటకు వచ్చింది. అదే మాదిరిగా రష్మి గౌతమ్ యొక్క పెళ్లి విషయం ఏదో ఒక రోజు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా రష్మి గౌతమ్ తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించకుండా ఉంటుందా అంటూ కొందరు ఆమె అభిమానులు మరియు జబర్దస్త్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు…
