
Balakrishna unstoppable with show next guest ss rajamouli episode promo went viral in social media
నందమూరి బాలకృష్ణ అఖండ భారీ విజయంతో సంతోషంలో మునిగి తేలుతున్నారు. మరోవైపు ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అనే టాక్ షో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కార్యక్రమం రోజురోజుకు అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా లైక్‌లు, వ్యూస్ తో ఈ షో ఇటీవలే సరికొత్త రికార్డును సృష్టించింది. మొదటి ఎపిసోడ్‌లోనే విలక్షణ నటుడు మోహన్ బాబుతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్‌లో యువ నటుడు నానితో గోల గోల చేశాడు. బ్రహ్మానందం, స్టార్ హీరో మహేష్ తో చేసిన ఏపిసొడ్ లు అభిమానులను ఎంతగానో అలరించాయి. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత బ్రహ్మ కీరవాణి లతో వస్తున్న ఏపిసొడ్ ప్రోమో విడుదల అయింది.
Balakrishna unstoppable with show next guest ss rajamouli episode promo went viral in social media
ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రోమో టోటల్ ఏపిసొడ్ పై భారీ అంచనాలను నెలకొల్పుతోంది.షో లో భాగంగా హోస్ట్ బాలయ్య… రాజమౌళిని తన ప్రశ్నలతో ఇరకాటంలో పడేలా చేశారు. మీరు ఇంటిలిజెంట్ అని… అఛీవర్ అని తెలుసు.. ఇంకా ఎందుకు ఆ గడ్డం అని అడిగితే రాజమౌళి గడ్డాన్ని సవరించుకుంటారే కానీ ఆన్సర్ చెప్పలేదు ఈ ప్రోమోలో. ఆ తర్వాత మన ఇద్దిరి కాంబినేషన్‌లో ఇంతవరకు సినిమా రాలేదు కదా… నా అభిమానులు మిమ్మల్ని బాలయ్యతో ఎప్పుడు సినిమా చేస్తారని ప్రశ్నిస్తున్నారు కదా ? అని ప్రశ్నిస్తే.. రాజమౌళి మీసం తిప్పుకున్నారే తప్ప రిప్లే ఇవ్వలేదు. మూడో ప్రశ్నగా.. మీతో సినిమా చేస్తే.. హీరోతో పాటు ఇండస్ట్రీకీ హిట్ ఇస్తారు.. కానీ మరి తర్వాత ఆ హీరో చేసిన రెండు, మూడు సినిమాలు ఫసక్ యేగా అని బాంబు పే…
రాజమౌళి దానికీ ఆన్సర్ ఇవ్వలేదు. చివరగా.. సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి అని బాలయ్య అడిగితే.. అప్పుడు దానికి స్పందనగా.. రాజమౌళి ఇలా అంటాడు. మీకు తెలుసు.. నాకు తెలుసు.. ఇది ప్రోమో అని.. అసలైన ఆన్సర్లు పూర్తి ఎపిసోడ్‌లో చెబుతానని అంటారు రాజమౌళి.ఇలా ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ప్రోమోనే ఇలా ఉంటే.. ఇంకా పూర్తి ఏపిసొడ్ లో వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదని అర్థం అవుతోంది. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో..? బాలయ్య రాజమౌళిని ఏం ఏం ప్రశ్నలు అడిగారో అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.