BalaKrishna : నిన్న గుర్ర‌మెక్కిన బాలయ్య‌, ఇప్పుడు స‌తీమ‌ణితో జీపెక్కాడుగా.. వీడియో వైర‌ల్

Authored By Sam C | The Telugu News | Published on: January 16, 2022, 2:00 pm

BalaKrishna : అఖండ‌తో ఈ ఏడాది సక్సెస్ అందుకున్న బాల‌కృష్ణ త్వ‌ర‌లో గోపిచంద్ మ‌లినేనితో మూవీ చేయ‌బోతున్నాడు. ఇక ఆహా కోసం అన్‌స్టాప‌బుల్ అనే షో చేస్తున్నాడు. ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అయితే సంక్రాంతి సంద‌ర్భంగా త‌న వ‌ర్క్‌కి బ్రేక్ ఇచ్చిన బాల‌య్య కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యుల తో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.

ఈ ఏడాది సంక్రాంతి పండగను బాలకృష్ణ ఇలా సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో ప్లాన్ చేశారు. బాలయ్య తన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా బాలకృష్ణ నాచ్ ఘోడ గుర్రమెక్కి కొద్దిసేపు కుటుంబసభ్యులను అలరించారు. అనంతరం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా.. బాలకృష్ణ గుర్రం కళ్ళెం పట్టుకుని అదుపుచేశారు. బాలకృష్ణ విన్యాసాలు చూసేందుకు భారీగా అభిమానులు హాజరయ్యారు.

balakrishna video viral in social media

balakrishna video viral in social media

BalaKrishna : బాల‌య్య హంగామా మాములుగా లేదు..!

ఇక తాజ‌గా బీచ్‌లో బాల‌కృష్ణ త‌న భార్య వ‌సుంధ‌ర‌ని జీప్ ఎక్కించుకొని కొద్ది సేపు సంద‌డి చేశారు. బాల‌య్య త‌న భార్య‌తో ఫ‌న్ కూడా క్రియేట్ చేశారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. బాల‌య్య ఎక్క‌డ ఉన్నా కూడా సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుందని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp