Balakrishna : బాలకృష్ణ ఆమె ఉంటేనే అంటున్నాడు .. సో స్పెషల్ ఫ్లైట్ లో ఆమె ని తీసుకొస్తున్నారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : బాలకృష్ణ ఆమె ఉంటేనే అంటున్నాడు .. సో స్పెషల్ ఫ్లైట్ లో ఆమె ని తీసుకొస్తున్నారు !

Balakrishna : టాలీవుడ్ లో నటసింహం బాలయ్య నయనతార కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో స్క్రీన్ పై ఈ జంటను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. వీరిద్దరూ కలిసి గతంలో సింహం, శ్రీరామరాజ్యం, జై సింహా లాంటి హిట్లు కొట్టారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 July 2023,2:00 pm

Balakrishna : టాలీవుడ్ లో నటసింహం బాలయ్య నయనతార కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో స్క్రీన్ పై ఈ జంటను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. వీరిద్దరూ కలిసి గతంలో సింహం, శ్రీరామరాజ్యం, జై సింహా లాంటి హిట్లు కొట్టారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే బాలయ్య తరువాతి సినిమాని వీలైనంత త్వరగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ గా నయనతారని ఎంపిక చేశారని తెలుస్తుంది. అందుకు నయనతారను కూడా సంప్రదించినట్లు తెలిసింది ఆమె కూడా దీనికి ఓకే చెప్పింది. నయన్ బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు కేటాయించలేదట. అందుకు కాస్త సమయం కావాలని అడిగిందట. ప్రస్తుతం నయనతార చాలా సినిమాలు చేస్తుంది. కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్లో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది.

Balakrishna want to Nayanthara in his movie

Balakrishna want to Nayanthara in his movie

ఇంకా ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయని సమాచారం. నయన్ కేవలం టాలీవుడ్ కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. షారుక్ ఖాన్ నటిస్తున జవాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. దీని కారణంగానే బాలయ్య సినిమాలకు ఎక్కువ డేట్లు కేటాయించలేక పోతుంది. ఈ సినిమా పూర్తి అయ్యాక బాలయ్య సినిమాకి డేట్లు కేటాయించే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలాంటి టాక్ ఇస్తుందో చూడాలి. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే వీరిద్దరి కాంబినేషన్ కి మరింత క్రేజ్ వస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది