
Balakrishna : అసెంబ్లీలో కనిపించని బాలయ్య.. అలిగి వెళ్లిపోయారా, లేకుంటే ఇంకేమైన జరిగిందా?
Balakrishna : నందమూరి బాలయ్య నటుడిగా, రాజకీయ నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో అఖండ విజయం సాధించారు. ప్రస్తుతం రాజకీయంగాను, సినిమా ఇండస్ట్రీలోను సత్తా చాటుతున్నారు. అయితే హ్యాట్రిక్ హిట్ కొట్టినా కాని.. ఈసారి కూడా కొన్ని సమీకరణాల దృష్ట్యా బాలయ్యకు మంత్రి పదవి దక్కలేదు. అయినా ఆయన దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తన సినిమాల విషయంలో మాత్రం ఇచ్చిన కమిట్మెంట్ ను ఖచ్చితంగా పూర్తి చేయడానికి టైమ్ ఇస్తాడు బాలయ్య. ఈక్రమంలోనే ఇప్పుడు అదే పనిమీద ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ నడుస్తోంది. ఈక్రమంలో బాలయ్య మాత్రం అసెంబ్లీలో కనిపించలేదు.
బాలయ్య అసెంబ్లీలో కనిపించకపోయే సరికి ఎక్కడికి వెళ్ళాడని చాలామంది వెతుక్కుంటున్నారు. కొన్ని రోజులుగా బాలయ్య కనిపింకపోవడంతో.. ఆయన అలిగారా..? దానికి కారణం పదవి రాలేదనా..? అని రకరకాల రూమర్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలయ్య తన సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ కు బాగా గ్యాప్ రావడంతో.. డైరెక్టర్ కు ఇచ్చిన మాట ప్రకారం తన సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు బాలకృష్ణ. ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీతో ఓ మూవీ చేస్తున్నారు నటసింహం. ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతోంది.
Balakrishna : అసెంబ్లీలో కనిపించని బాలయ్య.. అలిగి వెళ్లిపోయారా, లేకుంటే ఇంకేమైన జరిగిందా?
అక్కడి జైపూర ప్యాలెస్ లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బాబీ సినిమాను త్వరలో కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ కారణంగానే ఆయన అసెంబ్లీకి రాలేదని తెలుస్తోంది. నిర్మాతలకి ఇచ్చిన మాట ప్రకారం తన షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటారు బాలకృష్ణ. దర్శకులను కాని నిర్మాతలను కాని ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. ఆయన ఏది చెబితే అది చక్కగా చేసి చూపిస్తారు. అఖండతో మంచి విజయం అందుకున్న బాలయ్య వరుస సినిమాలు చేస్తున్నాడు. త్వరలో అఖండ2తో సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారు బాలకృష్ణ.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.