Pawan Kalyan : పవన్‌ని మళ్లీ కాక పట్టడం మొదలు పెట్టి బండ్లన్న | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pawan Kalyan : పవన్‌ని మళ్లీ కాక పట్టడం మొదలు పెట్టి బండ్లన్న

Pawan Kalyan :పవన్‌ కళ్యాణ్‌ ను బండ్ల గణేష్ దేవుడు అంటూ తెగ పొగడ్తలతో ముంచెత్తడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఆయన్ను బండ్ల గణేష్ పొగిడినందుకు గాను ప్రతిఫలంగా గబ్బర్ సింగ్‌ వంటి సినిమాను బండ్ల గణేష్ కు దక్కింది. ఆ తర్వాత కూడా బండ్ల గణేష్ ను చేరదీసి తన వద్ద ఉండనిచ్చాడు. ఒకానొక సమయంలో బండ్ల గణేష్‌ ఒక ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పవన్‌ కళ్యాణ్ ను చాలా మోసం చేశాడట. […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 August 2022,9:20 pm

Pawan Kalyan :పవన్‌ కళ్యాణ్‌ ను బండ్ల గణేష్ దేవుడు అంటూ తెగ పొగడ్తలతో ముంచెత్తడం మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. ఆయన్ను బండ్ల గణేష్ పొగిడినందుకు గాను ప్రతిఫలంగా గబ్బర్ సింగ్‌ వంటి సినిమాను బండ్ల గణేష్ కు దక్కింది. ఆ తర్వాత కూడా బండ్ల గణేష్ ను చేరదీసి తన వద్ద ఉండనిచ్చాడు. ఒకానొక సమయంలో బండ్ల గణేష్‌ ఒక ప్రాపర్టీ కొనుగోలు సమయంలో పవన్‌ కళ్యాణ్ ను చాలా మోసం చేశాడట. ఆ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా వెళ్లడించాడు. తాను పవన్ ను మోసం చేసినా కూడా ఆయన నన్ను మళ్లీ నమ్మాడు అన్నాడు.

తాను మోసం చేసిన విషయాన్ని చెప్పిన బండ్ల గణేష్ తనకు మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులు అందరికి కూడా పవన్‌ కళ్యాణ్ దేవుడు అనేది బండ్ల గణేష్ మాట. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్‌ కు బండ్ల గణేష్ దూరం అయ్యాడు. బండ్ల గణేష్ ను స్వయంగా త్రివిక్రమ్‌ దూరం ఉంచుతున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేష్‌ కు పవన్‌ కళ్యాణ్‌ కు మధ్య త్రివిక్రమ్‌ ఉన్నాడనే విషయం భీమ్లా నాయక్‌ సినిమా యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాల సమయంలో క్లారిటీ వచ్చింది.

bandla ganesh trying to go to near pawan kalyan again

bandla ganesh trying to go to near pawan kalyan again

పవన్ తో మళ్లీ చేరువ అయ్యేందుకు బండ్లన్న తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే రెగ్యులర్ గా పవన్‌ కళ్యాణ్ గురించి ట్వీట్స్ చేస్తున్నాడు. గతంలో భూమి విషయంలో మోసం చేస్తేనే మళ్లీ దగ్గరకు తీసుకున్న పవన్ కళ్యాణ్‌ ఈసారి కూడా మళ్లీ తనను తన తప్పులను క్షమించి దగ్గరకు తీసుకుంటాడనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో బండ్ల గణేష్ ను పవన్‌ అభిమానులు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వారు అంతా కూడా పవన్‌ తప్పకుండా బండ్ల ను క్షమించాలని కోరుకుంటున్నారు. మరి పవన్‌ ఏం చేస్తాడో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది