జాన్వీ కపూర్ మీద అలాంటి టాక్ ఉంది కాబట్టే టాలీవుడ్ కి తీసుకు రావడం లేదట ..?

Authored By vamana sai | The Telugu News | Published on: December 20, 2020, 1:22 pm

జాన్వీ కపూర్ అందాల తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత తన టాలెంట్ తో నే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ధడక్ సినిమా తో బాలీవుడ్ కి పరిచయం అవుతున్న సమయంలో చాలామంది జాన్వీ కపూర్ ని తల్లి శ్రీదేవి తో పోల్చుకుంటూ రక రకాల కామెంట్స్ చేశారు. కానీ అలా కామెంట్స్ చేసిన వాళ్ళకి ఫస్ట్ సినిమా తోనే గట్టి షాకిచ్చింది జాన్వీ కపూర్. డెబ్యూ సినిమాగా వచ్చిన ధడక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జాన్వీ కపూర్ ఏమాత్రం ఆలోచించకుండా డేరింగ్ స్టెప్ వేసి వెబ్ సిరీస్ లో కూడా నటించింది.

Watch Dhadak Full Movie Online in HD | ZEE5

‘ఘోస్ట్ స్టోరీస్’ అన్న టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ అన్న బయోపిక్ లో నటించిన జాన్వీ ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసి అద్భుతంగా నటించిందన్న పేరు తెచ్చుకుంది. లాక్ డౌన్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన ఈ సినిమాతో జాన్వీ కపూర్ భారీ హిట్ అందుకుంది. కాగా ప్రస్తుతం బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించిన ‘రూహి అఫ్జనా’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

Gunjan Saxena: The Kargil Girl' Review: Janhvi Kapoor's film touches upon  feminism like 'rainbow in the sky'

ఇలా జాన్వీ కపూర్ నటనలో .. ప్రయోగాలు చేయడంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఒకవైపు క్రేజీ మూవీస్ మరొకవైపు వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది. కాగా జాన్వీ సినిమా ఎంట్రీ ఇస్తుందన్నప్పటి నుంచి మన టాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్ కి తీసుకు రావాలని ట్రై చేస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ మన టాలీవుడ్ హీరోలకి పర్‌ఫెక్ట్ గా సెట్ కావడం లేదన్న కారణంగా ఎప్పటికప్పుడు టాలీవుడ్ ఎంట్రీ వెనక్కి వెళుతూ వస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అఖిల్, ఎన్.టి.ఆర్ ల సినిమాలలో అనుకున్నారన్న టాక్ వచ్చింది. కానీ ఇంతవరకు జాన్వీ కపూర్ ని ఎవరూ టాలీవుడ్ కి తీసుకు రాలేకపోతున్నారు. చూడాలి మరి జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో.

vamana sai

No bio available for this author.

  1. "November Box Office : నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ వద్ద రక్తపాతం.. క్రేజీ సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఫిక్స్..!"

  2. "Prabhas Imanvi : ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వీకి బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఇన్ని రకాల వంటకాలా..!"

  3. "Jailer 2 Movie First Review : జైలర్ మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!"

  4. "Ysrcp : ఉన్నదే 11 సీట్లు.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! వైసీపీ హైడ్రామాపై నెటిజన్ల సెటైర్లు.!"

  5. "AP Local Elections : మున్సిపల్ సీట్ల పంపకంలో కూటమి బిగ్ ట్విస్ట్.. నేడే తేల్చేయనున్న టీడీపీ-జనసేన-బీజేపీ..!"

  6. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  7. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp