Home » Entertainment » Bellamkonda Srinivas Vinayak Are They Facing Problem In Bollywood
Entertainment

Bellamkonda srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ – వినాయక్ బాలీవుడ్ సినిమాకి పెద్ద సమస్య..?

Authored By
vamana sai
The Telugu News | Published on: February 7, 2021, 12:50 pm
Advertisement

Bellamkonda srinivas : బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఫస్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా అటు హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కి, ఇటు దర్శకుడిగా వివి వినాయక్ కి డెబ్యూ సినిమా. వినాయక్ టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి .. బాలకృష్ణ.. ప్రభాస్.. వెంకటేష్.. రవితేజ.. ఎన్.టి.ఆర్ లాంటి వాళ్ళకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. టాలీవుడ్ లో దర్శకుడిగా వినాయక్ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే చిరంజీవి తో రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వినాయక్ లూసీఫర్ రీమేక్ అవకాశం వచ్చినట్టే వచ్చి జారిపోయింది.

Advertisement

bellamkonda-srinivas-vinayak-are-they-facing-problem-in-bollywood

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేసింది వినాయక్ అన్న సంగతి తెలిసిందే. అల్లుడు శీను సినిమాతో బెల్లంకొండ శ్రీను టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్స్.. స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నాడు. కాని కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ అన్నది మాత్రం దక్కలేదు. ఆ మధ్య రాక్షసుడు సినిమాతో ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతి బరిలో అల్లుడు అదుర్స్ ఫ్లాప్ సినిమాగా మిగిలింది. ఈ సినిమా మీద బెల్లంకొండ శ్రీను చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కాని అల్లుడు అదుర్స్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Advertisement

Bellamkonda srinivas : ఒకే చెప్పినా కూడా కళ్ళు బైర్లు కమ్మే రెమ్యూనరేషన్ అడుగుతున్నారట..?

అయితే బెల్లంకొండ శ్రీను సినిమాలలో స్టార్ హిరోయిన్స్ నటిస్తుండటం ఆసక్తికరం. అలాగే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని ట్రై చేస్తున్నారట. కాని ఇంకా ఎవరూ ఒకే చెప్పడం లేదని సమాచారం. ఇక్కడ సమంత .. కాజల్.. రకుల్ లాంటి స్టార్ హీరోయిన్స్ బెల్లంకొండతో సినిమా చేసేందుకు సై అన్నప్పటికి బాలీవుడ్ లో మాత్రం ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ఒకే చెప్పినా కూడా కళ్ళు బైర్లు కమ్మే రెమ్యూనరేషన్ అడుగుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టాలీవుడ్ లో రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఛత్రపతి సినిమాకి రీమేక్ గా రూపొందబోతోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి