Betting Apps Case : దూకుడు పెంచిన ఈడీ.. ఏకంగా 29 మంది ప్ర‌ముఖుల‌పై కేసులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Betting Apps Case : దూకుడు పెంచిన ఈడీ.. ఏకంగా 29 మంది ప్ర‌ముఖుల‌పై కేసులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2025,12:40 pm

Betting Apps Case  : బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్ కేసులోకి ఈడీ ఎంటర్ కావ‌డంతో ఇప్పుడు అంద‌రి గుండెల్లో టెన్ష‌న్ మొద‌లైంది. విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు న‌టులు రానా ద‌గ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత‌, నిధి అగర్వాల్‌, శ్రీముఖి, రీతూ చౌద‌రి, యాంక‌ర్ శ్యామ‌ల‌, అనన్య నాగళ్ల త‌దిత‌రులపై కేసు న‌మోదు చేశారు.

Betting Apps Case దూకుడు పెంచిన ఈడీ ఏకంగా 29 మంది ప్ర‌ముఖుల‌పై కేసులు

Betting Apps Case : దూకుడు పెంచిన ఈడీ.. ఏకంగా 29 మంది ప్ర‌ముఖుల‌పై కేసులు..!

Betting Apps Case  : కొత్త చిక్కులు..

ఇక సోష‌ల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లల‌లో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లపై ఈడీ కేసు నమోదుచేసింది.

సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సినీ సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈడీ రెడీ అయింది. ఇప్పుడు సెలబ్రిటీలు అందరినీ విచారణకు మళ్లీ ఆ కేసు విషయమై పిలిచేందుకు సిద్ధమైంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది