Bhagyashri Borse : ఆ అందాల భామ వెంటపడుతున్న టాలీవుడ్.. భాగ్యశ్రీ లక్ ఈ రేంజ్ లో ఉందే..!
ప్రధానాంశాలు:
Bhagyashri Borse : ఆ అందాల భామ వెంటపడుతున్న టాలీవుడ్.. భాగ్యశ్రీ లక్ ఈ రేంజ్ లో ఉందే..!
Bhagyashri Borse : టాలీవుడ్ Tollywood లో ఎప్పుడూ హీరోయిన్స్ కొరత ఉంటుంది. దాన్ని సరిగా యూజ్ చేసుకునే భామలు చాలా తక్కువమంది ఉంటారు. ఐతే మిస్టర్ బచ్చన్ భామ మాత్రం అందులో పర్ఫెక్ట్ అనిపించుకుంటుంది. ఈ అందాల భామ మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసింది. తొలి సినిమాతోనే ఆడియన్స్ లో ఒక గుర్తింపు సంపాదించింది. అంతేకాదు అమ్మడి గ్లామర్ షోకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. మిస్టర్ బచ్చన్ పోయినా కూడా భాగ్య శ్రీ బోర్స్ కి వరుస అవకాశాలు వచ్చాయి. విజయ్ దేవరకొండ తో కింగ్ డమ్ సినిమాలో ఛాన్స్ అందుకున్న భాగ్య శ్రీ ఆ సినిమాతో పాటు కాంత సినిమా ఛాన్స్ కూడా అందుకుంది. ఈ రెండిటితో పాటు రామ్ 22 వ సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. ఈ 3 సినిమాలు మూడు డిఫరెంట్ సినిమాలు అవ్వడంతో అమ్మడికి లక్కీగా మారాయి.

Bhagyashri Borse : ఆ అందాల భామ వెంటపడుతున్న టాలీవుడ్.. భాగ్యశ్రీ లక్ ఈ రేంజ్ లో ఉందే..!
Bhagyashri Borse: సూర్య వెంకీ అట్లూరి సినిమాలో కూడా
అంతేకాదు లేటెస్ట్ గా సూర్య వెంకీ అట్లూరి సినిమాలో కూడా భాగ్య శ్రీని హీరోయిన్ గా తీసుకుంటారన్న టాక్ వచ్చింది. అదే నిజమైతే మాత్రం అమ్మడి పంట పండినట్టే లెక్క. విజయ్ కింగ్ డమ్ ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాగా వస్తుంది. ఈ సినిమాతో తప్పకుండా భాగ్య శ్రీ మంచి పాపులారిటీ తెచ్చుకునే చాన్స్ ఉంటుంది. ఇది చాలదు అన్నట్టుగా సూర్య సినిమాలో ఛాన్స్ అంటే అమ్మడి ఫేట్ మారినట్టే లెక్క.
ఇదే కాదు టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా కూడా భాగ్య శ్రీ వెంట పడుతున్నారని తెలుస్తుంది. అమ్మడు ఏ ముహుర్తాన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో కానీ అమ్మడి లక్ అలా ఉందని అనుకుంటున్నారు. కచ్చితంగా భాగ్య శ్రీకి ఈ సినిమాలన్నీ కూడా పాపులారిటీ తెచ్చేలా చేస్తాయని అనిపిస్తుంది. మిగతా హీరోయిన్స్ ఖాళీగా మేం చేస్తామని అంటున్నా వాళ్లని పట్టించుకోకుండా భాగ్య శ్రీకే వరుస అవకాశాలు ఇస్తున్నారు మేకర్స్. అమ్మడికి హిట్టు పడకపోతేనే ఇలా ఉంటే ఒక్క హిట్టు పడితే ఇక ఆపడం కష్టమనేలా ఉంది. Bhagya Sri, Mr Bachchan, Raviteja, Vijay Devarakonda, Kingdom