Vijay wife Sangeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 7 March 2026, 2:25 pm
  •  Vijay wife Sangeetha వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య

  •  Vijay wife Sangeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య

Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్‌కు తన భార్య సంగీత గట్టి షాక్ ఇచ్చారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, విడాకుల ప్రక్రియ నడుస్తోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. తమ విడాకుల కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు, తాను విజయ్ నివసిస్తున్న ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.

Vijay wife Sankgeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య

Vijay wife Sankgeetha : వరుస షాకులతో విజయ్ కి నిద్ర లేకుండా చేస్తున్న భార్య

Vijay wife Sangeetha విజయ్ పై కోర్ట్ లో మరో పిటిషన్ వేసిన భార్య

రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఈ పరిణామాలు విజయ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో తన హక్కుల గురించి కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెన్నై నీలంకరైలోని విలాసవంతమైన ఇంట్లో తనకు కూడా సగం వాటా ఉందని, చట్టపరంగా ఆ ఇంట్లో ఉండే హక్కు తనకు ఉందని ఆమె పేర్కొన్నారు.

విడాకుల కేసు పూర్తిగా ముగిసే వరకు లేదా తాను సొంతంగా వేరే ఇంటికి మారే వరకు అదే ఇంట్లో నివసించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోరినట్లు సమాచారం. ఒకవైపు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న విజయ్‌కు, ఇంటి నుండే ఇలాంటి వరుస షాకులు తగులుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి