
bheemla nayak gets huge response in us advance bookings
Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అభిమానులలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ త్వరలో భీమ్లా నాయక్‌తో పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించగా, పలు కారణాల వలన ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. అయితే అభిమానులని నిరాశపరచకూడదని భావించిన చిత్ర యూనిట్ సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తుంది.
2021 కి వీడ్కోలు పలుకుతూ.. 2022 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ.. జరుపుకునే పార్టీల్లో మోత మ్రోగేలా డీజీ పాటను రిలీజ్ చేసింది. నిజానికి భీమ్లా నాయక్ మూవీ నుంచి నవంబర్ 7వ తేదీన ‘లాలా భీమ్లా అడవి పులి’ సాంగ్ రిలీజ్ అయింది. అదే సాంగ్ ను డీజే వెర్షన్ లో మరోసారి చిత్ర యూనిట్ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రిలీజ్ చేసింది. ఈ పాటని ఫ్యాన్స్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.ఇక సంక్రాంతి సందర్భంగా చిత్రం నుండి టీజర్ ప్లాన్ చేశారట. ఇప్పటికే టీజర్ విడుదలకు సంబంధించిన అన్ని పనులను మేకర్స్ పూర్తిచేసినట్లు తెలుస్తోంది.
bheemla nayak surprise on Pawan Kalyan in Sankranti
సంక్రాంతి గిఫ్ట్ గా సినిమాను రిలీజ్ చేయకపోయినా కనీసం టీజర్ ని అయినా రిలీజ్ చేస్తున్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందన్నది తెలియాల్సి ఉంది. చిత్రంలో పవన్‌తో పాటు రానా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్‌హిట్‌గా మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ లో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
Vegetables And Fruits : మన రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు చాలా ముఖ్యమైనవి. అయితే మనకీ దొరికే ప్రతి…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
This website uses cookies.