Big Boss 5 Telugu : షణ్ముక్ మాటలకు రూం లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్న సిరి..తర్వాత ఏమైంది?

Authored By mallesh | The Telugu News | Published on: November 16, 2021, 8:30 pm

Big Boss Telugu Season5 : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ గత సీజన్స్‌తో పోల్చితే ఈ సారి డిఫరెంట్‌గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. 19 మందితో స్టార్ట్ అయిన షో లో ప్రజెంట్ 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇకపోతే ఈ షోలో మొదటి నుంచి కలిసి మెలిసి ఉన్న షణ్ముక్ జస్వంత్ , సిరి మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. ఈ విషయం స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ప్రోమో ద్వారా స్పష్టమైంది.

Big Boss Telugu Season5 : తనదే తప్పు అని కన్నీటిపర్యంతమైన షణ్ను..

big boss 5 telugu Shanu vs siri

big boss 5 telugu Shanu vs siri

స్టార్ మా విడుదల చేసిన సదరు ప్రోమోలో షణ్ముక్ జస్వంత్ ఏడుస్తుండగా, సిరి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని షణ్ముక్ అనగా, సిరి తన తలను తానే బాదుకుంటుంది. ఆ తర్వాత షణ్ను ఒడిలో పడుకునే ప్రయత్నం చేస్తుంది. అలా చేసినప్పటికీ షణ్ముక్ జస్వంత్ కన్విన్స్ కాడు. గేమ్ కోసం అలా చేస్తున్నావని ఆరోపిస్తాడు. దాంతో హర్ట్ అయిన సిరి రూం లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది.

రూం వద్దకు వెళ్లి షణ్ముక్ డోర్ ఓపెన్ చేయాలని సిరిని అడుగుతాడు. అయినప్పటికీ సిరి డోర్ ఓపెన్ చేయదు. దాంతో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వెంటనే పరిగెత్తుకుని వచ్చి డోర్ ఓపెన్ చేయాలని సిరిని అడుగుతారు. అంతటితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇంతకీ సిరి రూం లోపల ఏం చేస్తుందో అనే ఆసక్తిని పెంచేలా ప్రోమో ఉంది. ఈ ప్రోమో ప్రజెంట్ నెట్టింట తెగ వైరలవుతోంది.

Also read

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp