Bigg boss 5 : బిగ్ బాస్ 5 లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన నిర్వాహకులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg boss 5 : బిగ్ బాస్ 5 లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన నిర్వాహకులు..!

Bigg boss 5 : బాలీవుడ్ లో ఇప్పటికే 13 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు, తమిళ భాషల్లో 5 వ సీజన్ కి రంగం సిద్దం అవుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవరిస్తున్నాడు. తమిళంలో విశ్వ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా నిర్వాహకులతో 5 సీజన్స్ కే కమల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కమల్ బిగ్ బాస్ హోస్ట్ గా […]

 Authored By govind | The Telugu News | Updated on :29 June 2021,12:10 pm

Bigg boss 5 : బాలీవుడ్ లో ఇప్పటికే 13 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు, తమిళ భాషల్లో 5 వ సీజన్ కి రంగం సిద్దం అవుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవరిస్తున్నాడు. తమిళంలో విశ్వ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా నిర్వాహకులతో 5 సీజన్స్ కే కమల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కమల్ బిగ్ బాస్ హోస్ట్ గా దూరం కానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో మొదటి సీజన్ కి జూనియర్ ఎన్.టి.ఆర్, రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు.

bigg boss 5 latest update

bigg-boss-5-latest update…

కాగా ఈ ఏడాది రాబోయో బిగ్ బాస్ సీజన్ 5కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడని సమాచారం. దాదాపు నాగ్ ఫైనల్ అయ్యాడని త్వరలో ఆయన మీద ప్రోమో షూట్ కూడా జరగబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక గత సీజన్ కంటే మరింత భారీ స్థాయిలో బిగ్ బాస్ 5 ఉండబోతోందట. ఈసారి కాస్త పాపులర్ నటీ, నటులను తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. మోనాల్ గజ్జర్ లాంటి ఫేడౌట్ హీరోయిన్స్ కాకుండా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్స్, యాంకర్స్ మీద ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.

Bigg boss 5 : టిక్ టాక్ దుర్గారావు, ఇమ్మానియేల్, వర్ష,

ఇక బిగ్ బాస్ సీజన్ 4 గత ఏడాది మొదలైన సెప్టెంబర్ నెలలోనే సీజన్ 5 కూడా ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ సారి కూడా సెప్టెంబర్ మొదటి వారం నుంచి స్టార్ మా లో బిగ్ బాస్ షో సీజన్ 5 మొదవబోతోందని అర్థమవుతోంది. ఇక ఇప్పటికే కొంతమంది పార్టిసిపెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం. వారిలో టిక్ టాక్ దుర్గారావు, ఇమ్మానియేల్, వర్ష, టాలీవుడ్ లో ఈ మధ్య బాగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్స్..ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో కనిపిస్తున్న న్యూస్ రీడర్…తెలుగు పాపులర్ కమెడియన్స్ ఉన్నారట. చూడాలి మరి దీనికి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు రానుందో.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది