
Bigg boss 5 : బాలీవుడ్ లో ఇప్పటికే 13 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు, తమిళ భాషల్లో 5 వ సీజన్ కి రంగం సిద్దం అవుతోంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవరిస్తున్నాడు. తమిళంలో విశ్వ నటుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా నిర్వాహకులతో 5 సీజన్స్ కే కమల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కమల్ బిగ్ బాస్ హోస్ట్ గా దూరం కానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగులో మొదటి సీజన్ కి జూనియర్ ఎన్.టి.ఆర్, రెండవ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు.
bigg-boss-5-latest update…
కాగా ఈ ఏడాది రాబోయో బిగ్ బాస్ సీజన్ 5కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడని సమాచారం. దాదాపు నాగ్ ఫైనల్ అయ్యాడని త్వరలో ఆయన మీద ప్రోమో షూట్ కూడా జరగబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక గత సీజన్ కంటే మరింత భారీ స్థాయిలో బిగ్ బాస్ 5 ఉండబోతోందట. ఈసారి కాస్త పాపులర్ నటీ, నటులను తీసుకు రానున్నట్టు తెలుస్తోంది. మోనాల్ గజ్జర్ లాంటి ఫేడౌట్ హీరోయిన్స్ కాకుండా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్స్, యాంకర్స్ మీద ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇక బిగ్ బాస్ సీజన్ 4 గత ఏడాది మొదలైన సెప్టెంబర్ నెలలోనే సీజన్ 5 కూడా ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ సారి కూడా సెప్టెంబర్ మొదటి వారం నుంచి స్టార్ మా లో బిగ్ బాస్ షో సీజన్ 5 మొదవబోతోందని అర్థమవుతోంది. ఇక ఇప్పటికే కొంతమంది పార్టిసిపెంట్స్ ని షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం. వారిలో టిక్ టాక్ దుర్గారావు, ఇమ్మానియేల్, వర్ష, టాలీవుడ్ లో ఈ మధ్య బాగా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్స్..ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో కనిపిస్తున్న న్యూస్ రీడర్…తెలుగు పాపులర్ కమెడియన్స్ ఉన్నారట. చూడాలి మరి దీనికి సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు రానుందో.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.