Home » Entertainment » Bigg Boss 5 Telugu Ancho Ravi And Siri Plans Didnt Work
Entertainment

Bigg Boss 5 Telugu : మొత్తానికి బలయ్యారు.. బొక్క బోర్లా పడ్డ సిరి, రవి

Authored By
aruna
The Telugu News | Published on: November 9, 2021, 2:30 pm
Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎన్నెన్నో మలుపులు వచ్చాయి. ముందుగా కెప్టెన్ అయిన ఆనీ మాస్టర్ ఓ నలుగురిని సెలెక్ట్ చేసుకుని జైల్లో వేయాలి. అందులో భాగంగా ఆనీ మాస్టర్ ముందుగా కాజల్, మానస్, సన్నీ, షన్నులను జైల్లో వేసింది. ఇక ఇది మొదటి దశ. ఇక రెండో లెవెల్‌లో అసలు కథ షురూ అయింది. జైలు బయట ఉన్న సభ్యులు ఆ నామినేట్ అయిన వ్యక్తులను కాపాడవచ్చు. బయటకు తీసుకురావచ్చు. అలా బయటకు వచ్చిన ఆ వ్యక్తి.. మరో ఇద్దరి పేర్లు చెబుతాడు. వారిలోంచి మళ్లీ ఇంకో వ్యక్తి లోపలకు వెళ్తాడు. అలా నామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది.

Advertisement

Bigg Boss 5 Telugu Ancho Ravi And Siri Plans Didnt work

జైల్లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకు రావాలంలే సమయానుసారంగా బజర్ వస్తుంది.. అప్పుడు బయట ఉన్న వ్యక్తులు తాళం గురించి పోటీపడాలి. అది లభించిన వారు.. ఒకరిని బయటకు తీసుకురావచ్చు. అలా బయటకు వచ్చిన వ్యక్తి.. మరో ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేస్తాడు. అందులో ఓ కంటెస్టెంట్‌ను తాళం పట్టుకొచ్చిన వ్యక్తి జైల్లో వేయాల్సి ఉంటుంది. అలా మొదటి బజర్ మోగిన సమయంలో.. అందరూ కావాలనే ప్రియాంకకు అవకాశం ఇచ్చారు.

Advertisement

Bigg Boss 5 Telugu : సిరి, రవికి ఎదురుదెబ్బ

షన్ను, సిరి, రవి వేసిన ప్లాన్ ప్రకారం.. ప్రియాంకకు మొదట తాళం దొరికింది. మానస్‌ను బయటకు తీసుకొచ్చింది. మానస్ లెక్క ప్రకారం రవి, జెస్సీని నామినేట్ చేశాడు. చివరకు ప్రియాంక నిర్ణయం మేరకు జెస్సీని లోపల పడేశారు. అలా ఎన్నో ప్లాన్లు వేశారు సిరి, రవి. కానీ చివరకు ఆ ఇద్దరే నామినేషన్లోకి వచ్చారు. కాజల్ వల్ల సిరి లోపలకు వెళ్లింది. షన్ను వల్ల రవి జైల్లో పడ్డాడు. చిరవకు ఆనీ మాస్టర్ వల్ల కాజల్ కూడా నామినేషన్లోకి వచ్చింది. మొత్తానికి చివరకు సిరి, రవికి బొక్క పడింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి