bigg boss 5 telugu lobo fired on priya
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతో ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. ఇక హౌస్‌లోకి 19మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే కొందరు ఎలిమినేట్ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ అంటేనే ఇందులో ఎవరు ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారో అనేది ఊహించడం కూడా చాలా కష్టమే. కాగా ఈ సారి షోలో చాలా వరకు కొత్త ఆరోపణలు రావడం చూస్తున్నాం. బయటకు వెళ్తున్న వారు కచ్చితంగా ఏదో ఒక ఆరోపణ చేయడంతో అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. మొదటగా ఎలిమినేట్ అయిన సరయు వెళ్తూ సిరి షన్ను బయటే మాట్లాడుకుని వచ్చారని, అందుకే ఇలా హౌస్ లో కలిసి ఆడుతున్నారంటూ సంచలన ఆరోపనలు చేసిన సంగతి తెలసిందే.
bigg boss 5 telugu lobo fired on priya
ఇంకొందరేమో యాంకర్ రవి, లోబో రిలేషన్ బయట నుంచే ఉందని, ఇద్దరూ కలిసి ఫిక్సింగ్ చేసుకున్నట్టు ఆడుతున్నారని, ఒకరినొకరు నామినేట్ చేసుకున్నా చివరకు వారిద్దరూ ఒకటే అని చెప్తున్నారు కంటెస్టెంట్లు. అంతే కాదండోయ్ యాంకర్ రవిని ఏదైనా అంటే లోబో వెంటనే రియాక్టు అవుతున్నాడని, రవిని ఏమీ అననివ్వట్లేదని చెప్తున్నారు. అయితే లోబో రవి విషయంలో చేస్తున్నది నిజమేనని తాజాగా వదిలిన ప్రోమో తెలియజేస్తోంది. అదేంటంటే హౌస్‌లో నాలుగో వారం నామినేషన్‌లో భాగంగా కంటెస్టెంట్ లోబో కాస్త రెచ్చిపోయాడు.
bigg boss 5 telugu lobo fired on priya
అయితే తన సీరియస్ నెస్‌కు సిల్లీ కారణం చెప్పడం అందరనీ షాక్ కు గురి చేస్తోంది. ఇప్పటికే చెత్త కారణాలతో నామినేషన్‌లు చేస్తున్నాడనే ఆరోపణలు లోబోపై బోలెడన్ని ఉంటున్నాయి. అంటే ఒక్క లోబోనే కాకుండా మిగిలిన వారందరూ కూడా అలాగే చేస్తున్నారనుకోండి. ఇక ఇప్పుడు ఎందుకు సీరియస్ అయ్యాడంటే.. తొలి ప్రేమ విషయాలు చెప్పాలంటూ బిగ్ బాస్ చెప్పగా ఇందులో భాగంగా లోబో తన గతాన్ని అందరికీ వివరించాడు. అయితే ఆయన గతంపై కంటెస్టెంట్ ప్రియ కామెంట్ చేస్తూ ఏదో మూవీ స్టోరీలా ఉందని చెప్పడంతో లోబో కాస్త సీరియస్‌గా తీసుకున్నాడంట. ఇక ప్రియ కామెంట్ ను నామినేషన్ పమయంలో గుర్తుకు చేసి మరీ లోబో సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
bigg boss 5 telugu lobo fired on priya
ఇక ఈ సమయంలో ప్రియ మీద అంత ఎత్తున లేచి బాగా అరిచాడు. అయితే అతని అరుపులకు ప్రియ కూడా బాగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా అరిస్తే బాగుండదని గట్టిగానే చెప్పింది ప్రియ. కానీ లోబో మాత్రం తాను అవేమీ పట్టించుకోనంటూ ఇలానే అరుస్తానంటూ ఇంకా మీద మీదకు వెళ్లడం చూడొచ్చు. అయితే ఈ సమయంలోనే లోబో కాస్త ఎమోషనల్ కావడం మళ్లీ రవి వచ్చి ఓదార్చడం కామన్ అయిపోతుంది. అయితే లోబో విషయలో ప్రియ మాట్లాడుతూ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడొద్దంటూ సూచిస్తుంది. కాగా ప్రోమో చూస్తుంటే గొడవ చాలా పెద్దది అన్నట్టు తెలుస్తోంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.