Bigg Boss 5 Telugu : వరస్ట్ హెస్ట్.. నాగార్జున మీద నెటిజన్ల ఆగ్రహం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : వరస్ట్ హెస్ట్.. నాగార్జున మీద నెటిజన్ల ఆగ్రహం

 Authored By bkalyan | The Telugu News | Updated on :14 November 2021,8:56 am

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో హోస్ట్ అనేవాడు అందరినీ సరిసమానం చూడాలి. ఎవరు తప్పు చేసినా కూడా మందలించగలిగాలి. అసలు తప్పు ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగిందో కనిపెట్టి ఇద్దరినీ శిక్షించాలి. అంతే కానీ ఒక మాట పట్టుకుని దాన్నే సాగదీస్తూ ఒక్కడినే నిందితుడిగా చేయడం కరెక్ట్ కాదు. కానీ నిన్ననాగార్జున చేసిన పని మాత్రం అదే. పాపం సన్నీని కార్నర్ చేసేశాడు. తన ఉద్దేశ్యం అది కాదని చెబుతున్నా వినిపించుకోలేదు. తప్పు చేశాడని నిర్దారించేశాడు.

తంతా, అప్పడం అవుతావ్.. యూట్యూబ్ వరకే అంటూ ఇలాంటి కొన్ని మాటలు సన్నీ వదిలాడు. అది తప్పే. కానీ తన ఇంటెన్షన్ అది కాదంటూ చెప్పేందుకు సన్నీ ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. తంతాను అన్నావా? లేదా? అన్నావా? లేదా?.. అమ్ముతాను అని అన్నావా? లేదా? నిన్ను అమ్ముతాను అని అన్నావా? లేదా? అంటూ సన్నీని కార్నర్ చేశాడు. దీంతో సన్నీ కూడా అడ్డంగా బుక్కయ్యాడు. మాటలు మార్చడంతో సన్నీ నిలువునా దొరికిపోయాడు.

Bigg Boss 5 Telugu Netizens Fires On Nagarjuna In Sunny Matter

Bigg Boss 5 Telugu Netizens Fires On Nagarjuna In Sunny Matter

Bigg Boss 5 Telugu : నాగార్జునపై ఆగ్రహ జ్వాలలు..

అలాంటి మాటలు మాట్లాడలేదు అంటూ సన్నీ బుకాయించాడు. వీడియోలతో అడ్డంగా దొరికిపోయాడు. అయితే సన్నీ తప్పులు కొన్ని ఉన్నా కూడా అవతలి వారి తప్పులు కూడా ఉన్నాయి.. వారిని మాత్రం ఏమీ అనలేని నాగార్జున.. సన్నీని బలి చేశాడు. ముద్దాయి అని ముద్ర వేశాడు. అలా మొత్తానికి నాగార్జున తన హోస్టింగ్ స్థాయి ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వెళ్తే ఇలానే ఉంటుందని నెటిజన్లు నాగార్జున మీద దుమ్మెత్తిపోస్తున్నారు.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది