Suma : ఇంట్లో వాళ్ల బెదిరింపులు!.. రాజీవ్ కనకాల కాళ్లకు మొక్కిన సుమ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 14 November 2021, 7:15 am

Suma : యాంకర్ సుమ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన భర్త రాజీవ్ కనకాలతో చేసే అల్లరి, సరదా చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక తెరపై ఈ ఇద్దరూ కలిసి వస్తే మాత్రం అదిరిపోతుంది. అలా స్టార్ మహిళ, క్యాష్ వంటి షోలకు అప్పుడప్పుడు రాజీవ్ కనకాల ముఖ్య అతిథిగా వస్తుంటాడు.నేడు రాజీవ్ కనకాల బర్త్ డే.

తన భర్త బర్త్ డే సందర్బంగా సుమ స్పెషల్ సెలెబ్రేషన్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి గ్రాండ్‌గా బర్త్ డేను సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా సుమ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో రాజీవ్ కనకాల కేకును కట్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కానీ ఇంకో దృశ్యం మాత్రం హైలెట్ అవుతోంది.

Suma Kanakala Touches Rajeev Kanakala Feet

Suma Kanakala Touches Rajeev Kanakala Feet

Suma : కాళ్లు మొక్కిన సుమ..

వీడియోలో ఉన్న ఓ వ్యక్తి.. సుమను బెదిరించాడు. ఆయన కాళ్ల మీద పడు.. మొక్కు అంటూ గద్మాయించాడు. దీంతో సుమ వెంటనే రాజీవ్ కనకాల కాళ్ల మీద పడింది. మొక్కింది. మామూలుగా అయితే సుమ బర్త్ డే అయితేనేమో.. అలా పడి ఉంటే ఏమీ అనుకునే వారు కాదు. కానీ ఇలా రాజీవ్ కనకాల బర్త్ డే అయి ఉండి.. సుమ కాళ్ల మీద పడటం ఏంటో అర్థం కావడం లేదు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp