Home » Entertainment » Bigg Boss 5 Telugu Priyanka Singh Life History
Entertainment

priyanka : బిగ్‌బాస్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక జీవితాన్ని మార్చేసిన ‘రూపాయి’..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 14, 2021, 4:30 pm
Advertisement

priyanka  : బిగ్‌బాస్ సీజన్-5 పాత ఎపిసోడ్‌ల కంటే అభిమానులను బాగా అలరిస్తోందని చెప్పుకోవచ్చు. ప్రతీ ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఎలిమినేషన్ పెరుగుతుండగా.. మిగిలిన ఆటగాళ్లు కసిగా ఆడుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లను గెలవాలనే లక్ష్యంతో వెంటనే పూర్తి చేస్తున్నారు. అయితే, ప్రియాంక మాత్రం తనకు ఇచ్చిన టాస్క్‌లను ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తూ మిగతా ఆటగాళ్ల కంటే ముందంజలో నిలుస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులరైన ప్రియాంక అలియాస్ సాయి తేజ.. తాను ట్రాన్స్ జెండర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది. దానికోసం ఎన్ని కష్టాలు, అవమానాలు భరించాల్సి వచ్చిందో చెబుతూ బిగ్‌బాస్ హౌస్‌‌లో ఎమోషనల్‌ అయ్యింది.

Advertisement

Bigg boss 5 telugu priyanka Singh life History

ప్రియాంక అసలు పేరు సాయి తేజ.. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ ప్రియాంక అలియాస్ పింకీగా తన రూపాన్ని, ఐడెంటిటీని మార్చేసుకుంది. ఈ విషయం తన తండ్రికి తెలియదని చెప్పింది ప్రియాంక. ఆమె బర్త్ డే సందర్భంగా తండ్రి బిగ్‌బాస్ హౌజ్ కు వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తనకు కొడుకైనా, కూతురైనా నువ్వే.. నిన్ను చూస్తే మాకు గర్వంగా ఉందని తండ్రి చెప్పడంతో ప్రియాంక ఆనందానికి అవుధుల్లేవని చెప్పొచ్చు.

Advertisement

priyanka : ప్రియాంక జీవితాన్ని మార్చిన ‘రూపాయి కాయిన్’

ఈ ఒక్క మాట కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్నానో తనకు మాత్రమే తెలుసునని ప్రియాంక భావోద్వేగానికి గురైంది. అసలు తాను సాయితేజ నుంచి పింకీగా మారడానికి గల కారణాలను వెల్లడించింది. తాను ట్రాన్స్ జెండర్‌ అవ్వాలని అనుకున్నప్పుడు ఎవరిని అడుగాలో తెలియక, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కు వెళ్లానని.. అక్కడ అమ్మవారి నిర్ణయం ప్రకారమే తాను ట్రాన్స్ జెండర్‌గా మారినట్టు తెలిపింది.

Bigg boss 5 telugu priyanka Singh life History

Advertisement

పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళి ఏదైనా కోర్కెలు కోరితే తప్పకుండా నెరవేరుతాయనే నగరవాసుల్లో నమ్మకం ఉంది. ముఖ్యంగా అమ్మవారి చెంత రూపాయి కాయిన్‌‌ను నిలబెట్టి భక్తులు మనసులో కోరిక కోరుకుంటారు. కాయిన్ కింద పడిపోతే ఆ కోరిక నెరవేరదు. ఒకవేళ కాయిన్ నిలబడి ఉంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని అందరూ బలంగా నమ్ముతారు.

తాను కూడా అదేవిధంగా అమ్మవారి చెంతకు వెళ్లి రూపాయి కాయిన్‌ను నిలబెట్టి మనసులో కోరిక కోరుకున్నాను. రూపాయి కాయిన్ పడిపోతే సాయితేజగా ఉండాలని.. నిలబడితే ప్రియాంకగా మారాలనుకున్నానని తెలిపింది. కాయిన్ పడిపోకుండా నిలబడే ఉండటంతో అమ్మవారి ఆశీస్సుల మేరకు వెంటనే ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్‌గా మారినట్టు చెప్పుకొచ్చింది ట్రాన్స్‌జెండర్ ప్రియాంక.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి