samantha Key decision on her life
Samantha : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సమంత అగ్రకథనాయికగా కొనసాగుతూ వస్తోంది. కెరీర్ మంచి రైజింగ్‌లో ఉన్న టైంలో అనుకోని బ్రేక్. సామ్ చై విడిపోతున్నారని రూమర్లు చక్కర్లు కొట్టడం అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకుంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో అందరూ ఒక్కసారిగా సామ్ పై విమర్శల వర్షం కురిపించారు. అయితే, విడాకుల గురించి వస్తున్న పుకార్లను ఖండించాల్సిన క్యూటెస్ట్ కపుల్.. అవును.. మేము నిజంగానే విడిపోతున్నామంటూ అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేశారు.
మేం రిలేషన్ నుంచి విడిపోతున్నాం.. కానీ, భవిష్యత్‌లో మంచి స్నేహితులుగా కొనసాగుతామంటూ సోషల్ మీడియాలో సామ్ చై పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి వివాహం సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ అండ్ క్యూటెస్ట్ కపుల్ వీరిదే అవుతుందని ఎంతో మంది ఆశించారు. కానీ, పెళ్లయిన కొన్నేళ్లకే వీరిద్దరూ ఇలా విడాకుల బాట పడతారని ఎవరూ ఊహించలేదు. దీనంతటికీ సమంతనే కారణమని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్న సమయంలో ఆమె అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
samantha Key decision on her life
ఇకపోతే పెళ్లి బంధం బ్రేక్ అయిన బాధ నుంచి బయట పడేందుకు సామ్ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నట్టు తెలిసింది. గత మెమోరీస్ గురించి ఆలోచించేంత టైం కూడా లేకుండా బిజీ సమయాన్ని గడపాలని ప్లాన్ చేసుకుందట. ఇటీవల తెలుగులో ఒక సినిమాను, హిందీలో ఒక మూవీని ఒకే చేసిన సామ్.. తాజాగా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లో ఓ మూవీ చేస్తోంది. అయితే, దసరా పండుగ రోజు అనగా అక్టోబర్- 15న సామ్ తన కెరీర్‌కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలుస్తోంది.
samantha Key decision on her life
ప్రస్తుతం సామ్ ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే తమిళ మూవీ చేస్తోంది. అందులో నయన్ తార, సామ్ కలసి యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ చేస్తున్నారు. తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పౌరాణిక చిత్రాన్ని సామ్ ఇటీవలే కంప్లీట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తి అయినట్టు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.