Bigg Boss 5 Winner Sunny : త‌న సినిమాకి బాల‌య్య షో టైటిల్ పెట్టుకున్న బిగ్‌ బాస్‌ 5 విన్నర్ సన్నీ ..!

Authored By Sam C | The Telugu News | Published on: June 1, 2022, 4:30 pm

Bigg Boss 5 Winner Sunny : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షో ద్వారా చాలా మంది స్టార్ స్టేట‌స్ అందుకున్నారు. అలా బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్‌గా అవ‌త‌రించి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందుకుంటున్నాడు స‌న్నీ. ఇతగాడు హీరోగా డైమండ్ రత్నబాబు ఓ సినిమాను చేయ‌నున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడొరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన డైమండ్ రత్నబాబు సన్నీతో సినిమా చేస్తుండడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విశేషం.

బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్‌గా నిలిచిన సన్నీ.. రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు సువ‌ర్ణ భూమి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ సంస్థ నుంచి 300 గ‌జాల భూమిని కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా రాణించేందుకు కృషి చేస్తున్నాడు. అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్) A2B ఇండియా ప్రొడక్షన్ ప్రవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రంజిత్ రావ్.బి నిర్మాతగా షేక్ రఫీ, బిట్టు న్యావనంది సహా నిర్మాతలుగా అద్భుతమైన హాస్య ప్రధాన చిత్రాన్ని నిర్మించనున్నారు.

Bigg Boss 5 Winner Sunny movie with balayya show name

Bigg Boss 5 Winner Sunny movie with balayya show name

Bigg Boss 5 Winner Sunny : స‌న్నీ ఆఫ‌ర్..

రచయితగా తనదైన కామెడీ శైలిలో సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించి బుర్రకథ లాంటి డిఫరెంట్ చిత్రంతో దర్శకుడిగా మారిన డైమండ్ రత్నబాబు 100% ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీతో ఈ అన్‌స్టాపబుల్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సన్నీ మాట్లాడుతూ.. ‘దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. బిగ్ బాస్ తర్వాత నటుడుగా నేను ప్రూవ్ చేసుకోవా లని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సినిమా చేస్తున్నాను. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను వందశాతం కష్టపడి పని చేస్తాను అని అన్నారు.

Also read

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp