Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఉండే కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టే ముందు కొన్ని ప్లాన్స్ వేసుకొని వెళుతుంటారు. ముఖ్యంగా పీఆర్ఓలని నియమించుకొని వెళతారంటూ ఈ మధ్య ప్రచారాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ షో మనకు చూపించేది కేవలం గంటసేపు మాత్రమే. దానిని బట్టి నెగెటివ్ గా వెళ్తున్నారా..? లేదంటే పాజిటివ్‌గా వెళ్తున్నారా..? అన్నది ఎలా తెలుస్తుందంటే.. బయట ఉన్న పీఆర్ఓలు అందరూ బీభత్సమైన ప్రచారం చేస్తారు. వారు సపోర్ట్ చేసే కంటెస్టెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను నెగిటివ్ చేస్తారు. పీఆర్ పని అదే..
ఇంతకు ముందు బిగ్ బాస్‌లో ఇలా ఉండేది కాదు. ఈ మధ్యనే అలా అవుతుంది. బిగ్‌బాస్‌కు వెళ్లే ముందు పీఆర్ఓలను పెట్టుకోవడం.. వాళ్లతో నెగిటివ్ పబ్లిసిటీ చేయించడం వంటివి చేస్తున్నారు. పాజిటివ్ అవ్వకపోయినా పరవాలేదు. ఎదుటి వారిని నెగెటివ్ చేయడమే వారి పని . నేను కూడా బాధితురాలినే పీఆర్ టీమ్ వల్లనే రెండు సార్లు ఎలిమినేట్ బయటకు వచ్చానని ఆ మధ్య సరయు చెప్పుకొచ్చింది. అయితే ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఆదిరెడ్డి అనే యూట్యూబర్ వెళ్లాడు. అతనికి ఫాలోయింగ్ తక్కువ కాబట్టి పబ్లిసిటీ కొసం ప్రత్యేకంగా పీఆర్ఓలని నియమించుకున్నట్టు తెలుస్తుంది.
ప్రతి రోజు ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోవడనికి సుమారుగా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చు చేస్తున్నాడని టాక్. మరి హౌజ్‌లో అయితే నిదానంగా గేమ్ ఆడుతున్న ఆదిరెడ్డి తాను పెట్టిన ఖర్చు మొత్తం తిరిగి తెచ్చుకుంటాడా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.బిగ్ బాస్ సీజన్ 6 లో మూడవ వారం కెప్టెన్ గా కామన్ మ్యాన్ గా వచ్చిన ఆది రెడ్డి ఎంపిక అయ్యాడు.ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.దానిలో దొంగలు వర్సెస్ పోలీసుల మధ్య పెద్ద ఫైట్ జరిగింది. ఫైనల్ గా పోలీసులే ఆ ఆటలో గెలుపొందారు. ఇక కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో మొదట బ్రిక్ బిల్డింగ్ ఇవ్వగా దానిలో ఫైమా, గీతు ఓడిపోయారు.ఇక మిగిలిన ఆది రెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్యలలో మరో టాస్క్ ఇవ్వగా ఫైనల్ గా కామన్ మ్యాన్ ఆది రెడ్డి గెలిచి బిగ్ బాస్ 3వ వారం కెప్టెన్ అయ్యాడు.బిగ్ బాస్ రివ్యూయర్ గా క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ కంటెస్టంట్ ఛాన్స్ అందుకున్న ఆది రెడ్డి హౌజ్‌లో అదరహో అనిపిస్తున్నాడు
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.