Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో డ్రామా క్వీన్.. బాబోయ్ ఆమె షేడ్స్ చూసి షాక్ అవుతున్న ఆడియన్స్..!

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో వారాలు గడుస్తున్నా కొద్దీ హౌస్ మెట్స్ అసలు రంగు బయట పడుతుంది. ఒక్కొక్క వారం ఒక్కోలా ప్రవర్తిస్తూ తమ ఆటని మారుస్తూ వస్తున్న ఆట గాళ్లు ఎవరన్నది ఆడియన్స్ కనిపెట్టేస్తున్నారు. ఈ సీజన్ లో ఊసరవల్లిలా మారుతున్న కంటెస్టంట్ ఎవరు అంటే ఇంకెవరు ఇనయా సుల్తానా అని అంటున్నారు. మొదటి 3 వారాలు చిన్న చిన్న కారణాలకు కూడా హౌస్ మెట్స్ మీద గొడవకు దిగిన ఆమె ఆర్జే సూర్యతో క్లోజ్ ఆయ్యాక తన కోపాన్ని తగ్గించుకుంది. అయితే సూర్య అంటే ఇష్టంగా ఉంటూ అతన్ని నామినేట్ చేసి అతను హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి కారణం అయ్యింది.

ఇష్టపడిన అతన్నే వెళ్లాలని నామినేట్ చేయడం.. రేవంత్ తో సూర్య ఈ వీక్ వెళ్లిపోవాలని అనడం ఇనయా ఆడుతున్న డబుల్ గేం ని బయట పెట్టింది. ఇదే విషయాన్ని రేవంత్ నామినేషన్స్ టైం లో బయట పెడితే ఆమె సమాధానం చెప్పకుండా మళ్లీ ఎటాకింగ్ మోడ్ లో వెళ్లింది. ఎంతగా అంటే ఎక్కువమంది హౌస్ మెట్స్ తనని టార్గెట్ చేస్తుండగా ఇనయా బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ నేనే అంటూ ఎనౌన్స్ చేసుకుంటూ నానా రచ్చ చేసింది. ఇదంతా పక్కన పెడితే నామినేషన్స్ పూర్తి కాగానే వెళ్లి బాత్ రూం డోర్ వేసుకుని వెళ్లి బోరున ఏడ్చేసింది. ఆడియన్స్ లో తాను ఎక్కడ నెగటివ్ అవుతానో అని ఇనయా ఆడుతున్న ఈ డబుల్ గేం అందరికి అర్ధమైంది.

Bigg Boss 6 Telugu drama queen in bigg boss house

అంతేకాదు ఈ సీజన్ లో ఇనయానే డ్రామా క్వీన్ అని.. టైటిల్ గెలిచేందుకు ఆమె ఎవరితో అయినా క్లోజ్ గా ఉంటుంది.. ఎవరితో అయినా కయ్యానికి దిగుతుంది. ఇనయా ఆట తీరు అసలేమాత్రం ఆడియన్స్ ని నచ్చట్లేదు. ముఖ్యంగా సూర్యతో ఉంటూ సూర్య వెళ్లాలని కోరడం ఆమె మీద ఇప్పటివరకు ఉన్న కాస్త కూస్తో అభిమానం కూడా పోయింది. అందుకే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఇనయా దాదాపు ఎలిమినేట్ అవడం పక్కా అని అంటున్నారు. ఇనయా వెళ్తేనే హౌస్ లో కొద్దిగా ప్రశాంతత ఉంటుందని ఫీలయ్యే వారు కూడా ఉన్నారు. మరి ఈ డ్రామా క్వీన్ ని హౌస్ లో ఉంచుతారా లేక ఎలిమినేట్ చేస్తారా అన్నది మరో నాలుగు రోజుల్లో తెలుస్తుంది.

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

2 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

5 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

7 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

10 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

12 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago