Home » Entertainment » Bigg Boss 6 Telugu Faima Performance Top 5 Fix
Entertainment

Bigg Boss 6 Telugu : లెక్కకు మించి ఆడేస్తున్న ఫైమా.. టాప్ 5 బెర్త్ ఖాయం..!

Authored By
Rame Samhith
The Telugu News | Published on: October 16, 2022, 4:30 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో వచ్చి ఆ అంచనాలకు తగినట్టుగా ఆడుతున్న ఒకే ఒక్క కంటెస్టంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా జబర్దస్త్ ఫైమా అని చెప్పొచ్చు. పటాస్ షో ద్వారా పరిచయమై.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ వచ్చిన ఫైమా ఎక్కువగా బుల్లెట్ భాస్కర్ టీం లో చేస్తూ వచ్చింది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ముందు ఆలోచించినా తప్పకుండా ఇదొక గొప్ప అవకాశం అని ఒప్పేసుకుంది. మిగతా వాళ్లతో పోల్చితే రెమ్యునరేషన్ కూడా అంత ఎక్కువేమి కాదని తెలుస్తుంది.

Advertisement

అయితే జబర్దస్త్ ఇమేజ్ తో బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చిన ఫైమా ఆ క్రేజ్ ని కొనసాగిస్తుంది. ఆట విషయంలో ఎక్కడ తగ్గని ఫైమా అవసరమైనప్పుడల్లా తన కామెడీతో మెప్పిస్తుంది. ఫైమా చేస్తున్న కామెడీ.. ఆటలో ఇస్తున్న టఫ్ ఫైట్ ఆడియన్స్ కి కూడా నచ్చేసింది. అందుకే ఆమెని టాప్ లో ఉంచుతున్నారు. ఈవారం కూడా బ్యాటరీ టాస్క్ లో కూడా ఫైమా బాగానే ఆడింది. కెప్టెన్సీ కోసం బాస్కెట్ లో బాల్ టాస్క్ విషయంలో సుదీప, రోహిత్ లతో ఫైట్ కూడా చేసింది. ఫైనల్ గా వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా ఆమె ఆట తీరుకి గుడ్ అని చెప్పేశారు.

Bigg Boss 6 Telugu faima performance top 5 fix

Advertisement

ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం ఫైమా టాప్ 5 లో పక్కా అని చెప్పొచ్చు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఫైమా పెద్దగా ఆలోచించకుండా తన ఆట తాను ఆడుతూ ప్రతి దానిలో బెస్ట్ ఇస్తూ వచ్చింది. అందుకే ఆమె టాప్ 5 లో కన్ ఫర్మ్ అని అంటున్నారు. అయితే మిగతా కంటెస్టంట్స్ నుంచి రాబోయే రోజుల్లో గట్టి పోటీ వస్తే మాత్రం ఫైమా రిస్క్ లో పడినట్టే అని చెప్పొచ్చు. హౌజ్ లో ఉన్న ఫీమేల్ కంటెస్టంట్స్ లో ఏ గేం అయినా సరే ఫైమా తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తుంది. అదే ఆమెకి ప్లస్ అని చెప్పొచ్చు. అంతేకాదు తన పాయింట్ తను చెప్పడంలో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేకుండా వాదిస్తుంది. అందుకే ఆమెకి టాప్ 5 లో ఉండే అర్హత ఉందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి