How to Make Bendakaya Egg Recipe in Telugu
Bendakaya Egg Recipe : ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ ఇంకా ఎగ్ కాంబినేషన్లో బెండకాయ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా నచ్చుతుందండి బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. . తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ బెండకాయ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.. ఈ బెండకాయ ఎగ్ ఫ్రై కి కావలసిన పదార్థాలు : బెండకాయలు, కోడిగుడ్లు, పసుపు కారం, ఉప్పు, కరివేపాకు, ధనియా పౌడర్, కొత్తిమీర, ఆయిల్ ఉల్లిగడ్డలు,మొదలైనవి… దీని తయారీ విధానం… ముందుగా మూడు నుండి నాలుగు దాకా కోడిగుడ్లు తీసుకోండి అండ్ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకోండి ఇక వీటిని పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడి అయిన తర్వాత ముందుగా తీసుకున్న ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి. ఎగ్స్ వేసుకొని ఇలా ఆయిల్ లో కాస్త ఫ్రై చేసుకోవాలి.
కేవలం ఒక స్పూన్ ఆయిల్ లో ఎగ్స్ వేసుకొని ఎగ్ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ప్రె చేసుకుంటే సరిపోతుంది. కాస్త పెద్ద ముక్కలుగానే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే కడాయినిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని ఎండు మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి ఇవి ఆయిల్ లో కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ లో ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసి అవి కూడా ఫ్రై చేసుకుని ముందుగా తీసుకున్న బెండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని గరిటతో కలుపుకుండ ఇ బెండకాయ ముక్కల్ని ఇలా టాస్ చేసుకోండి గరిటతో కలిపారు అంటే జిగురు ఎక్కువగా వస్తుంది. సో ఇలా టాస్ చేసుకొని కొంచెం పసుపు కూడా వేసి ముక్కల్లో బాగా కలిసేంతవరకు టాస్ చేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని మధ్య మధ్యలో ఇలా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గరట్తో కలిపారు అంటే కర్రీ ఇంకా జిగురు కూడా ఎక్కువ వస్తుంది.
How to Make Bendakaya Egg Recipe in Telugu
బెండకాయ ముక్కల్లోని జిగురు కాస్త తగ్గిపోయిన తర్వాత ముందుగా మనం పోపులో ఉల్లిపాయలు వేయలేదు కదా ఇప్పుడు వేసుకోవాలి. ముందుగానే ఉల్లిపాయలు వేసుకున్నారంటే బెండకాయల్లోంచి జిగురు ఎక్కువగా వస్తుంది. కూర పొడిపొడిగా రాదు సో బెండకాయలోని జిగురంతా పోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి. టాస్ చేస్తూ ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల దాకా కొబ్బరి పౌడర్ వెయ్యాలి.
డ్రై గా ఉన్న కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా వేసి బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఎగ్ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. ఇక ఎగ్ ముక్కల మీద ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి అండ్ ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇలా కారం ఉప్పు ఎగ్ ముక్కలు మీద వేసి ఇవి మొత్తం బెండకాయల్లో బాగా కలిసేంతవరకు కలుపుకోండి. ఇలా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు ఒక్కసారి కూడా గరిట పెట్టలేదు సో కూర పొడిపొడిగా వస్తుంది కూర మొత్తం ఫ్రై అయ్యేంతవరకు ఇలా టాస్ చేసుకుంటూనే ఫ్రై చేసుకున్నారంటే కూర చక్కగా పొడిపొడిగా వస్తుంది. ఫైనల్ గా కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఎగ్ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నారంటే అద్భుతంగా ఉండే బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది.
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…
Operation Sindoor : పాక్లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…
Anganwadis : అంగన్వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…
Double Bedroom Houses : గ్రేటర్లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని…
fish food : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్,…
AP Ration Cards : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆంధ్ర్ర్రప్రదేశ్ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు…
Chapati In TEA : కొందరికి టీలో కొన్ని వస్తువులని ముంచుకొని తినడం అలవాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు…
Eating Raw Onion In Summers : మండే వాతావరణం ఆరోగ్యం మరియు శ్రేయస్సును దెబ్బతీస్తుంది. కాబట్టి, శరీరాన్ని ప్రశాంతంగా,…
This website uses cookies.