Bigg Boss 6 Telugu : ఇనయా సుల్తానా చేస్తుంది రైటా రాంగా.. అక్కడ వాళ్లు ఓ రేంజ్ లో ఆడుకుంటుంటే.. ఇక్కడ ఓ రేంజ్ లో ఓట్లు గుద్దేస్తున్నారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 6 Telugu : ఇనయా సుల్తానా చేస్తుంది రైటా రాంగా.. అక్కడ వాళ్లు ఓ రేంజ్ లో ఆడుకుంటుంటే.. ఇక్కడ ఓ రేంజ్ లో ఓట్లు గుద్దేస్తున్నారు..!

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఈసారి ఇనయా ఒక ఫైర్ బ్రాండ్ గా ఏర్పడింది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి నానా రచ్చ చేస్తుంది. హౌస్ లో ఏ ఒక్కరితో కూడా క్లోజ్ గా ఉండని ఇనయా తన దారి తనదే అన్నట్టు ప్రవర్తిస్తుంది. మరీ ముఖ్యంగా శ్రీహాన్, ఫైమాల మీద అమ్మడు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. ఆటలో మాత్రమే అరుచుకోవడం.. కొట్టుకోవడం లాంటివి […]

 Authored By ramesh | The Telugu News | Updated on :8 November 2022,9:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఈసారి ఇనయా ఒక ఫైర్ బ్రాండ్ గా ఏర్పడింది. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి నానా రచ్చ చేస్తుంది. హౌస్ లో ఏ ఒక్కరితో కూడా క్లోజ్ గా ఉండని ఇనయా తన దారి తనదే అన్నట్టు ప్రవర్తిస్తుంది. మరీ ముఖ్యంగా శ్రీహాన్, ఫైమాల మీద అమ్మడు ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. ఆటలో మాత్రమే అరుచుకోవడం.. కొట్టుకోవడం లాంటివి జరిగినా ఆట తర్వాత కూడా ఇనయా ఆ కోపాన్ని ప్రదర్శిస్తుంది. అందుకే ఆమెతో ఫైమా, శ్రీహాన్ మాట్లాడటం మానేశారు. సోమవారం జరిగిన నామినేషన్స్ లో కూడా దాదాపు ఆమెకు 8, 9 నామినేషన్స్ పడ్డాయి.

అయితే హౌస్ లో ఒక విధంగా ఆమెను అందరు టార్గెట్ చేయగా బయట ఆడియన్స్ నుంచి బీభత్సమైన సపోర్ట్ వస్తుంది. ఈసారి నామినేషన్స్ జరిగి ఓటింగ్స్ ఓపెన్ అవగానే ఇనయూఅకి ఒక రేంజ్ లో ఓటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓ విధంగా ఇది ఇనయాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. హౌస్ లో ఆమె ఎటాకింగ్ ఆట అదిరిపోతుంది. తన ఆట తీరుపై ఎవరికి ఎలాంటి అవగాహన లేకుండా కన్ ఫ్యూజ్ గా ఆడుతూ వస్తున్న ఇనయా తనకు సపోర్ట్ చేస్తున్న వారితో కూడా గొడవ పడుతూ వస్తుంది. ఇన్నాళ్లు ఫైమాతో ఫ్రెండ్ షిప్ చేసిన ఇనయా ఆమె అంటే అసలు పడని విధంగా తయారయ్యింది.

Bigg Boss 6 Telugu inaya sulthana doing well or not voting

Bigg Boss 6 Telugu inaya sulthana doing well or not voting

ఇనయా ఆడుతున్న ఆట కరెక్టా కాదా అన్నది ఆడియన్స్ వేస్తున్న ఓట్లని బట్టి చెప్పొచ్చు. అయితే ఇనయా ఫైర్ బ్రాండ్ లా ఆడట తప్పు కాదు కాని కొన్నిసార్లు నోరు జారి అవతల వారిని అనరాని మాటలు అంటుంది. అదే ఆమెకు మైనస్ అవుతుంది. అంతేకాదు సూర్య ఎలిమినేషన్స్ కి కూడా పరోక్ష కారణం ఇనయానే అని చెప్పుకుంటున్నారు. తప్పో ఒప్పో ఇనయా ఇదే రేంజ్ దూకుడు చూపిస్తే మాత్రం టాప్ 1,2 లో కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు బిగ్ బాస్ రివ్యూయర్స్.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది