Bigg Boss Inaya : సొహైల్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసేసిన బిగ్‌ బాస్‌ ఇనయా.. వీడియో..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bigg Boss Inaya : సొహైల్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసేసిన బిగ్‌ బాస్‌ ఇనయా.. వీడియో..!!

Bigg Boss Inaya : బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అందరికంటే మంచి ఇమేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్ ఇనయా. స్టార్టింగ్ నుండి అద్భుతమైన గేమ్ ఆడి చాలామందికి పోటీ ఇచ్చింది. లేడీ టైగర్ అనిపించుకుంది. హౌస్ మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా గానీ ఇనయా మంచి పోరాటం పోరాడి… తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంది. నామినేషన్ లో ఉన్న ప్రతిసారి.. ఎక్కువ ఓట్లు రాబట్టింది. అయితే ఈ సీజన్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో సీజన్ 4 […]

 Authored By sekhar | The Telugu News | Updated on :27 December 2022,2:00 pm

Bigg Boss Inaya : బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అందరికంటే మంచి ఇమేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్ ఇనయా. స్టార్టింగ్ నుండి అద్భుతమైన గేమ్ ఆడి చాలామందికి పోటీ ఇచ్చింది. లేడీ టైగర్ అనిపించుకుంది. హౌస్ మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా గానీ ఇనయా మంచి పోరాటం పోరాడి… తిరుగులేని ఇమేజ్ సంపాదించుకుంది. నామినేషన్ లో ఉన్న ప్రతిసారి.. ఎక్కువ ఓట్లు రాబట్టింది. అయితే ఈ సీజన్ లో ఫ్యామిలీ ఎపిసోడ్ టైంలో సీజన్ 4 కంటెస్టెంట్.. సోహెల్ ..ఇనయా కోసం రావడం తెలిసిందే. ఇనయా తమ్ముడితో కలిసి వచ్చాడు.

ఆ సమయంలో సోహెల్ కోసం ఇనయా.. మణికొండ రూమ్ కి షిఫ్ట్ అవ్వడం మాత్రమే కాదు… అతడు చేసే జిమ్ములో కూడా జాయిన్ అవ్వటం వంటి విషయాలు బయటపడ్డాయి. అయితే బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫ్యామిలీ వీక్ టైంలో అందరు చూస్తుండగానే తనకి సోహైల్ అంటే ఇష్టమని.. తెలిపింది. అయితే ఇప్పుడు బయటకు వచ్చినా ఇనయా…సోహెల్ నీ కలిసి ఏకంగా ప్రపోజ్ చేసేసింది. ఇనయా ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇనయా.. సోహైల్ తో మాట్లాడుతూ.. మొదట మీకో సర్ప్రైజ్ అని.. కళ్ళు మూసుకోవాలని తెలిపింది. దీంతో సోహెల్.. నువ్వు రాగానే నేను షాక్ అయిపోయా.. అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఇనయా…

Bigg Boss Inaya Sultana Propose To Sohel

Bigg Boss Inaya Sultana Propose To Sohel

మోకాళ్ళ మీద ఉండి సోహెల్ కి రోజ్ ఫ్లవర్ ప్రపోజ్ చేయడం జరిగింది. ‘ఒకటి చెప్పదలచుకున్నాను.. నువ్వు ఏం అనుకున్నా పర్వాలేదు. నా మనసులో ఉన్నది నేను చెబుతానా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్‌. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని సొహైల్‌పై ప్రేమను కురిపించింది ఇనయా.అయితే దీనికి సొహైల్‌ ఏం సమాధానమిచ్చాడో మాత్రం సస్పెన్స్‌లో పెట్టిందీ బిగ్‌బాస్‌ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది