Home » Entertainment » Bigg Boss 6 Telugu Management On Leaked Matter
Entertainment

Bigg Boss 6 Telugu : మా యాజ‌మాన్యాన్నే ఉలిక్కిప‌డేలా చేస్తున్న బిగ్ బాస్ లీక్ మేట‌ర్..!

Authored By
Sam C
The Telugu News | Published on: September 22, 2022, 1:30 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్న గేమ్ షో బిగ్ బాస్. ప్ర‌స్తుతం తెలుగులో ఆస‌క్తిక‌రంగా సాగుతున్న ఈ గేమ్ షో రోజురోజుకి రంజుగా మారుతుంది. గ‌త సీజ‌న్స్ క‌న్నా ఈ సీజ‌న్ లో ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు తీసుకు రావడంతో పాటు కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను సృష్టిస్తూ ప్రేక్షకుల‌కి మంచి మ‌జాని పంచుతున్నారు. ఇక ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆరో సీజన్ మూడో వారం నామినేషన్స్ లిస్ట్ కూడా లీక్ అయింది.

Advertisement

Bigg Boss 6 Telugu : నామినేష‌న్స్ ర‌చ్చ‌..

నామినేష‌న్స్ ప్ర‌తి సోమ‌వారం చాలా రంజుగా సాగుతాయి. ఈ వారం నామినేష‌న్స్ మొహానికి రంగు పూసి మరి నామినేట్ చేయమన్నారు . అలానే ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున చేయాల్సి ఉంటుంది అని చెప్పారు.. ఈ క్ర‌మంలో నామినేషన్ లో మొత్తంగా పదిమంది ఉన్నారు.. రేవంత్, శ్రీహాన్, బాలాదిత్య, చంటి, గీతు, నేహా, సుదీప, ఆరోహి, ఇనయ, వాసంతి ఈ పదిమంది నామినేషన్ లో ఉన్నారు.. వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే చ‌ర్చ న‌డుస్తుంది. సింగ‌ర్ రేవంత్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబ‌ట్టి ఎలాగు సేవ్ అవుతాడు. మిగతా 9 మందిలో వాసంతి, అరోహి, ఇనయా డేంజర్ జోన్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ ముగ్గురిలో ఎవరైనా ఔట్ అవ్వచ్చు..

Bigg Boss 6 Telugu Management On Leaked Matter

Advertisement

ఇటు ప్రేక్ష‌కులు, అటు బిగ్ బాస్ యాజ‌యాన్యం తీసుకునే నిర్ణ‌యాల‌తో ఈ ముగ్గురి పేర్లు కూడా అటు ఇటు తారు మారు కావ‌చ్చు. ఏదేమైన మూడో వారం ఎలిమినేట్ అయ్య వారు ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. కాగా, బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో మొదటి వారం మాత్రం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి