Bigg Boss 6 Telugu : రేవంత్ 15 వారాలు రెమ్యూనరేషన్ తో పాటు విన్నింగ్ ప్రైజ్ మనీ డీటెయిల్స్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on: December 19, 2022, 3:20 pm

Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారంతో ముగిసింది. 15 వారాలు…దాదాపు 105 రోజులు సాగిన ఈ షోలో సింగర్ రేవంత్ టైటిల్ గెలిచాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే లో చిన్న ట్విస్ట్ చివరిలో చోటుచేసుకుంది. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు శ్రీహాన్ గెలుచుకున్నాడు. కానీ ₹40 లక్షల రూపాయల ఆఫర్ కి శ్రీహాన్… ఓకే చెప్పటంతో రేవంత్ విన్నర్ గా నిలిచాడు. దీంతో శ్రీహాన్ కి కాస్త గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కానీ డబ్బు పరంగా 40 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకోవడం జరిగింది.

ఈ పరిణామంతో ₹50 లక్షల ప్రైజ్ మనీలో రేవంత్ కి ₹10 లక్షలే దక్కాయి.అయినప్పటికీ బిగ్ బాస్ విజేతగా రేవంత్ గెలుచుకున్న మొత్తం…₹50 లక్షల రూపాయల పైనే ఉందని సమాచారం. విషయంలోకి వెళ్తే సీజన్ సిక్స్ ట్రోఫీతో పాటు ₹10 లక్షల ప్రైజ్ మనీ అందుకోవటం జరిగింది. వీటితోపాటు సువర్ణభూమి వారి 605 గజాల ఫ్లాట్, ₹10 లక్షల విలువైన మారుతి సుజుకి బ్రేజా కార్ ప్రకటించారు. అయితే వీటి మొత్తం విలువ చూస్తే… ఒక్క సువర్ణభూమి ప్లాట్ ₹30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

Bigg Boss 6 Telugu revanth remuneration with winning prize money details

Bigg Boss 6 Telugu revanth remuneration with winning prize money details

ఇక కారుతో మొత్తంగా కలిపి చేస్తే రేవంత్ కి ₹50 లక్షలు ముట్టినట్టే అని అంటున్నారు. ఇక ప్రైజ్ మనీ విషయం పక్కన పెడితే 15 వారాల పారితోషకం విషయంలో రేవంత్ ఒక వారానికి ₹60 వేల నుంచి ₹80వేలు బీబీ టీం ఇవ్వడం జరిగిందట. దీంతో 15 వారాలకు గాను తొమ్మిది నుంచి ₹11 లక్షలు పైనే… అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నాడట. మొత్తంగా చూసుకుంటే విన్నర్ ప్రైజ్ మనీ తో పాటు రెమ్యూనరేషన్ కలిపి ₹60 లక్షల పైనే…అందరికంటే ఎక్కువ రేవంత్ సంపాదించినట్లు ప్రచారం జరుగుతుంది.

 

Breaking News

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp