Bigg Boss 6 Telugu : ఈ వారం ఎలిమినేషన్ ట్విస్ట్ అదే.. పాపం ఆ జంటని విడదీస్తున్న బిగ్ బాస్.. దయలేదు అంటూ ట్రోల్స్..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: November 19, 2022, 7:40 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో 11వ వారం ఎలిమినేషన్ ఎవరన్నది లీక్ అయ్యింది. హౌస్ లో ఎంచక్కా కలిసి ఉన్న ఓ జోడీని బిగ్ బాస్ విడదీస్తున్నాడు. ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉండగా శ్రీ సత్య, మెరినాలు మాత్రమే డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే నిన్నటిదాకా శ్రీ సత్యనే ఎలిమినేట్ అవుతుందని అనుకోగా ఆమె బదులుగా మెరినాని ఇంటి నుంచి బయటకు పంపించేశారట. శ్రీహాన్, రేవంత్ లకు క్లోజ్ గా ఉండటం వల్ల శ్రీ సత్యకి చివరి నిమిషంలో ఓట్లు పడినట్టు తెలుస్తుని.

ఈ వారం రేవంత్, మెరినాల జోడీల్లో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. మెరినా హౌస్ లో ఉండటం వల్ల రోహిత్ కి మంచి సపోర్త్ అయితే ఆమె లేకపోతే రోహిత్ ఇంకాస్త ఫోకస్ చేసి ఆడతాడు. 11 వారాల్లో మొదటి నాలుగు వారాలదాకా రోహిత్, మెరినాలు ఇద్దరు ఒకే కంటెస్టంట్ గా పరిగణించారు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పాడో అప్పటి నుంచి వారిద్దరు సెపరేట్ గా ఆడుతూ వస్తున్నారు. రోహిత్ తన స్ట్రాంగ్ నెస్ చూపిస్తూ ఆటలో తన పనితనం ప్రదర్శిస్తున్నాడు.

Bigg Boss 6 Telugu this week elimination twist revealed

Bigg Boss 6 Telugu this week elimination twist revealed

మెరినా కూడా చాలా వరకు బెటర్ అనేలా ఉన్నా మిగతా వారిలా ఎలాంటి హడావిడి లేకుండా ఉండటం వల్ల ఆమెని ఎలిమినేట్ చేశారు. రోహిత్ మెరినాల్లోఫ్ మెరినా ఫస్ట్ వెళ్లిపోవడమే రోహిత్ ఆటకి ప్లస్ అవుతుంది. మెరినా కూడా హౌజ్ లో వంటా వార్పు చేస్తూ 11 వారాల దాకా నెట్టికొచ్చింది. సో రోహిత్ టాప్ 5 కి వెళ్లేలా ఆట ఆడితే ఈ ఇద్దరికి బిగ్ బాస్ వల్ల మంచి ఎమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. హౌస్ లో ప్రతి టాస్క్ లో రోహిత్ తన సత్తా చాటుతున్నాడు. రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్టుగా రోహిత్, ఆది రెడ్డి కలిసి ఆడితే వారిద్దరికి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp