Karthika Deepam 2 April 8th 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న కుట్ర.. జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. పెళ్లిరోజున ఊహించని ట్విస్ట్!

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 April 2026,8:30 am

Karthika Deepam 2 April 8th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రోజుకో కొత్త మలుపుతో, ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్‌తో టీఆర్పీ రేటింగ్స్‌లో దూసుకుపోతోంది. దీప, కార్తీక్ ల మధ్య బంధం బలపడుతున్న కొద్దీ, జ్యోత్స్నలో అసూయ, పగ పెరిగిపోతున్నాయి. దీపను ఎలాగైనా అడ్డుతొలగించుకుని కార్తీక్ ను దక్కించుకోవాలని జ్యోత్స్న వేస్తున్న ప్లాన్స్ అన్నీ బెడిసికొడుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 8) ప్రసారం కానున్న ఎపిసోడ్ లో Episode 639 ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీప ప్రాణాలు తీయడానికి జ్యోత్స్న చేసిన ప్రయత్నం, కార్తీక్ ఇచ్చిన మాస్ వార్నింగ్, దీప-కార్తీక్‌ల పెళ్లిరోజు వేడుకల గురించి తెలుసుకుందాం రండి.

Karthika Deepam 2 April 8th 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న కుట్ర.. జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. పెళ్లిరోజున ఊహించని ట్విస్ట్!

Karthika Deepam 2 April 8th 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న కుట్ర.. జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. పెళ్లిరోజున ఊహించని ట్విస్ట్!

Karthika Deepam 2 April 8th 2026 Episode దీప ప్రాణాలకు ముప్పు తెచ్చిన జ్యోత్స్న.. దొంగ నాటకాలు

ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంట్లో ఓ పెద్ద ప్రమాదం తప్పినట్లు చూపించారు. కిచెన్ దగ్గర నేలమీద నూనె (నెయ్యి) ఒలికి ఉండటంతో, అది గమనించని దీప కాలు జారి పడిపోబోతుంది. అయితే అకస్మాత్తుగా అక్కడే ఉన్న జ్యోత్స్న వేగంగా స్పందించి దీపను పడిపోకుండా పట్టుకుంటుంది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటారు. శివన్నారాయణ కలుగజేసుకుని.. “నువ్వు సరైన సమయానికి పట్టుకోకపోతే దీప తల గుమ్మానికి తగిలి పెద్ద ప్రమాదమే జరిగేది. దీప నిజంగా అదృష్టవంతురాలు” అని అంటాడు. వెంటనే జ్యోత్స్న తన నటనను మొదలుపెడుతుంది. “నువ్వు మా ఇంట్లో ఇలా జారిపడితే మా అత్త ఊరుకోదు కదా” అని దీపతో అంటూనే, కార్తీక్ వైపు తిరిగి.. “కడుపుతో ఉన్న భార్యను జాగ్రత్తగా చూసుకోవడం రాదా?” అని మండిపడుతుంది.

అయితే ఇదంతా జ్యోత్స్న ఆడుతున్న నాటకం అని ప్రేక్షకులకు అర్థమవుతూనే ఉంటుంది. “అందరూ ఊహించింది చేస్తే నేను జ్యోత్స్నని ఎందుకు అవుతాను, నా స్ట్రాటజీ వేరే ఉంది” అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ నవ్వుకుంటుంది. అయితే, ఎప్పుడూ దీపను చూస్తే రగిలిపోయే జ్యోత్స్న.. ఒక్కసారిగా దీపను కాపాడటం, ఆమెపై ప్రేమ కురిపించడం చూసి దశరథకు అనుమానం వస్తుంది. “దీప కిందపడిపోయేలా చేసింది నేనే.. కానీ దాన్ని కాపాడింది కూడా నేనే అని అందరూ నమ్ముతున్నారు” అని జ్యోత్స్న లోలోపల మురిసిపోతుంది.

Karthika Deepam 2 April 8th 2026 Episode కార్తీక్ మాస్ వార్నింగ్.. భయపడిన జ్యోత్స్న

జ్యోత్స్న వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడుతున్న సమయంలో కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. “పిల్లి పాలు తాగుతూ తనను ఎవ్వరూ చూడటం లేదని అనుకుంటుంది. కానీ అది పిల్లి కాదు, నక్క అని అందరికీ తెలియదు” అంటూ పరోక్షంగా జ్యోత్స్నకి సెటైర్లు వేస్తాడు కార్తీక్. ఆ మాటలకు జ్యోత్స్న షాక్ అవుతుంది. “అందరూ ఫ్లోర్ మీద పడింది నీళ్లు అనుకుంటున్నారు.. కానీ అది ఆయిల్ అని నాకు మాత్రమే తెలుసు. కడుపుతో ఉన్న ఆడమనిషిని కిందపడేయటానికి ఈ దొంగ పిల్లి ఎంతకైనా తెగించిందని నాకు అర్థమైంది” అంటూ జ్యోత్స్న తాట తీస్తానని వార్నింగ్ ఇస్తాడు.

“నీ ప్లాన్ మార్చుకున్నావా? ఇదంతా నాకు బెదిరింపా? లేక హెచ్చరింపా?” అని కార్తీక్ సూటిగా అడుగుతాడు. దీనికి జ్యోత్స్న ఏమాత్రం తగ్గకుండా.. “బెదిరించే దాన్నే అయితే ఏనాడో ఒక మంచి వాటంగా ఉన్నవాడిని పెళ్లి చేసుకుని హనీమూన్‌కు వెళ్లే దాన్ని” అంటూ పొగరుగా సమాధానం ఇస్తుంది. “దీపకి కానీ, తన కడుపులో ఉన్న బిడ్డకు కానీ ఏ చిన్న ప్రమాదం జరిగినా నిన్ను వదిలిపెట్టను” అని కార్తీక్ కరాఖండిగా చెబుతాడు. దీనికి జ్యోత్స్న బదులిస్తూ.. “నువ్వు ఏమైనా చేసుకో.. దీప అడ్డు తొలగించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా ఎజెండా ఒకటే, నీ చేత తాళి కట్టించుకోవడమే” అని తన పంతాన్ని తేల్చి చెబుతుంది.

పారిజాతం ఎంట్రీ.. నూనె ఎత్తుగడలపై ఫైర్

వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే అక్కడికి పారిజాతం వస్తుంది. జ్యోత్స్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కార్తీక్ అక్కడి నుంచి వెళ్తూ, “ఏం చేసినా ఆలోచించి చేస్తే అందరికీ మంచిది, సర్వేజనా సుఖీనో భవంతు” అని సెటైరికల్ గా వెళ్లిపోతాడు. ఆ తర్వాత పారిజాతం జ్యోత్స్నకు గట్టిగా క్లాస్ పీకుతుంది. “ఈ 1940 నాటి పాతకాలం నూనె పోసే అలవాట్లు మానేసి బుద్ధిగా ఉండు. నీ మంచికే చెబుతున్నాను.. దీప జోలికి రావొద్దు” అని వార్నింగ్ ఇస్తుంది. దీనికి జ్యోత్స్న చిరాకు పడుతూ, “నీకు బుర్ర సగమే పనిచేస్తోంది. నేను ఇక దీప జోలికి వెళ్లను, నేరుగా బావ జోలికే వెళ్తాను. మీ అందరికీ ఒక చిన్న సర్‌ప్రైజ్ ఉంది.. జస్ట్ వెయిట్ అండ్ సీ” అని తన కొత్త కుట్రకు తెరలేపుతుంది.

దీప, కార్తీక్‌ల పెళ్లిరోజు.. మురిసిపోయిన కుటుంబం

కిచెన్‌లో ఉన్న దీప దగ్గరకు కార్తీక్ వచ్చి, “నువ్వు ఈరోజు ఈ పనులన్నీ చేయకూడదు” అని చెబుతాడు. అప్పుడే పారిజాతం కూడా వచ్చి “ఈరోజు పనులన్నీ నేనే చేస్తాను. ముందు మీ ఇద్దరికీ దిష్టి తీస్తాను, కొత్త పెళ్లి జంటల్లా మెరిసిపోతున్నారు” అని అంటుంది. అసలు విషయం ఏమిటంటే.. ఆ రోజు కార్తీక్, దీపల పెళ్లిరోజు. పారిజాతం ఈ విషయాన్ని శివన్నారాయణ ఫ్యామిలీకి చెబుతుంది. శివన్నారాయణ సంతోషంగా.. “వీళ్లిద్దరినీ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది” అని అంటాడు.

కనీసం మాట మాత్రంగానైనా తమకు చెప్పలేదని దశరథ, సుమిత్ర కాస్త బాధపడతారు. “పనివాళ్ల పుట్టినరోజులు, పెళ్లిరోజులు యజమానులు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు” అని కార్తీక్ అనడంతో.. దశరథ, సుమిత్రలు “ఆ మాటలు మాట్లాడితే కొడతాం” అంటూ తమ ప్రేమను చాటుకుంటారు. వెంటనే కేక్ తెప్పిస్తానని దశరథ అంటాడు. కార్తీక్, దీప ఇద్దరూ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. “మా మొదటి పెళ్లిరోజుకు మేం కోరుకునేది ఒక్కటే.. మా రెస్టారెంట్‌లో భోజనం చేసి, పక్కనే ఉన్న థియేటర్‌లో సినిమా చూసి, సాయంత్రం మా అమ్మకి కబుర్లు చెబితే చాలు” అని కార్తీక్ తన సింప్లిసిటీని చూపిస్తాడు. “వీడు రాజ్యాలు సంపాదించిన రాజు కాదు.. మనుషుల్ని సంపాదించిన రాజు” అని దశరథ కార్తీక్ ను మెచ్చుకుంటాడు. పెళ్లిరోజు అని చెప్పనందుకు శివన్నారాయణ వారికి సరదాగా పనిష్మెంట్ ఇస్తూ, ఆ రోజంతా తన కారు వాడుకోమని, రేపు ఉదయం వరకు ఇంటికి రావొద్దని లీవ్ ఇస్తాడు.

ట్విస్ట్ ఇచ్చిన జ్యోత్స్న.. గుడి డ్రామా

కార్తీక్, దీప ఎంతో సంతోషంగా కారులో బయల్దేరడానికి సిద్ధమవుతుండగా.. అకస్మాత్తుగా జ్యోత్స్న సంప్రదాయబద్ధంగా శారీ కట్టుకుని వచ్చి వారిని ఆపుతుంది. జ్యోత్స్న వేషధారణ చూసి అంతా షాక్ అవుతారు. “నన్ను గుడికి తీసుకెళ్లు బావా” అని జ్యోత్స్న అడగటంతో అందరూ ఉలిక్కిపడతారు. జ్యోత్స్న మళ్ళీ ఏదో కొత్త డ్రామా మొదలుపెట్టిందని కార్తీక్‌కి వెంటనే అర్థమవుతుంది. జ్యోత్స్న దీప, కార్తీక్‌లకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతూనే తన కుట్రను అమలు చేస్తుంది. “దీప.. ఈలోపు నువ్వు వంట చేస్తూ ఉండు, నేను బావ గుడికి వెళ్లొస్తాం. ఈరోజు స్వామివారికి పాలాభిషేకం చేస్తే నాకు వెంటనే పెళ్లి జరుగుతుంది” అని అంటుంది.

దీనిని గమనించిన దశరథ, “అయితే నేను నిన్ను గుడికి తీసుకెళ్తాను పదా” అని అంటాడు. కానీ జ్యోత్స్న ఒప్పుకోదు. “నేను బావ నన్ను తీసుకెళ్లాలని సంకల్పించుకున్నాను.. బావే తీసుకెళ్తాడు” అని పట్టుబడుతుంది. ఎవరెన్ని చెప్పినా జ్యోత్స్న వినకపోవడంతో, సుమిత్రను తనవైపు తిప్పుకుంటుంది. జ్యోత్స్న మాటలకు పడిపోయిన సుమిత్ర.. “ఆ మొక్కు ఫలించి, దీనికి మంచి సంబంధం వచ్చి పెళ్లి జరిగితే బాగుంటుంది కదా కార్తీక్.. నువ్వే తీసుకెళ్లు” అని అంటుంది. సుమిత్ర కూడా జ్యోత్స్నకు సపోర్ట్ చేయడంతో కార్తీక్, దీపలు ఇద్దరూ షాక్ అవుతారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో ఏం జరగనుంది?

జ్యోత్స్న ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పెళ్లిరోజు నాడు భార్యను కాదని జ్యోత్స్నతో కార్తీక్ గుడికి వెళ్తాడా? సుమిత్ర మాటను కార్తీక్ జవదాటగలడా? ఈ డ్రామాలో దీప ఎలా రియాక్ట్ కాబోతుంది? అనేది రేపటి కార్తీక దీపం 2 Karthika Deepam 2 Tomorrow Episode ఎపిసోడ్‌లో అత్యంత ఆసక్తికరంగా మారనుంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి