#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు పల్లవి ప్రశాంత్ అంటే ఒక రైతు బిడ్డగా, యూట్యూబర్ గానే మనకు తెలుసు. అన్న నేను మళ్లొచ్చిన.. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లోకి పోవద్దా అంటూ పల్లవి ప్రశాంత్ ఎన్నో వీడియోలు చేశాడు. బిగ్ బాస్ లో అవకాశం కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గరికి కూడా వెళ్లాడు. కానీ.. పల్లవి ప్రశాంత్ ను గేట్ దగ్గరే సెక్యూరిటీ ఆపేసింది. అసలు పల్లవి ప్రశాంత్ అంటే ఎవరు అంటే ఒక రైతు బిడ్డ అనే స్థాయి నుంచి నేడు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, కోట్లాది మంది తెలుగు ప్రజలు అభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తిగా చరిత్రకెక్కాడు ప్రశాంత్. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే ఇప్పటి వరకు ఎవ్వరికీ రాని చాన్స్ ఒక్క పల్లవి ప్రశాంత్ కే వచ్చింది. పల్లవి ప్రశాంత్ కు వచ్చిన ఆఫర్ గురించి తెలిసి ప్రశాంత్ కూడా ఎగిరి గెంతేశాడు. అసలు సీజన్ కూడా ముగియకముందే పల్లవి ప్రశాంత్ కు బంపర్ ఆఫర్ వచ్చింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన భోలే షావలి.. బయట ఏం జరుగుతోందో ప్రశాంత్ కు చెవిలో చెప్పాడు. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ కాబట్టి.. భోలేకు ఆయనంటే ఇష్టం. అందుకే.. హౌస్ లోకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ కు ఓ విషయం చెప్పాడు. అది తనకు ఇప్పటికే సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పాడు. ఓ బడా నిర్మాత, బడా డైరెక్టర్ ప్రశాంత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడట. రైతు నేపథ్యంలో ఒక కథను రెడీ చేసుకున్నాడట. ప్రశాంత్ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వస్తాడో.. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడట. ఎలాగూ బడా డైరెక్టర్ కాబట్టి ప్రశాంత్ కూడా ఓకే చెబుతాడు అనే నమ్మకంతో ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని భోలే.. ప్రశాంత్ కు చెప్పడంతో ప్రశాంత్ ఎగిరి గెంతేశాడు. అంతే కాదు.. బయట ప్రశాంత్ పై పాజిటివిటీ ఎలా ఉందో కూడా భోలే చెప్పేశాడు.
#image_title
అయితే.. బయటి విషయాలు హౌస్ లో లీక్ చేయడం బిగ్ బాస్ నిబంధనలకు విరుద్ధం. అయినా కూడా భోలే అవేవీ పట్టించుకోకుండా బయటి విషయాలను ప్రశాంత్ కు చెప్పాడు. మరి భోలే చెప్పింది నిజమా కాదా అనేది పక్కన పెడితే ప్రశాంత్ మాత్రం ప్రస్తుతం హౌస్ లో చాలా సేఫ్ జోన్ లో ఉన్నాడు. టాప్ 5 లోకి వెళ్లే చాన్స్ ఉంది. చూడాలి మరి.. ప్రశాంత్ ఆటతీరు ఇంకా మున్ముందు ఎలా ఉంటుందో?
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్లోని కొత్తవాడలో ఇన్స్టాగ్రామ్లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
This website uses cookies.