Categories: EntertainmentNews

Bigg Boss 8 Telugu : వామ్మో.. ఇది బిగ్ బాస్ హౌజా, లేక ఇంకేదైన‌నా.. అలా కొట్టుకుంటున్నారేంటి?

Advertisement
Advertisement

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్ ర‌ణ‌రంగంగా మారుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో కొంద‌రు హౌజ్‌లోకి వ‌చ్చాక షో మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తుంది.తాజా ఎపిసోడ్‌లో ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ టాస్క్ కొనసాగింది. బుధవారం (అక్టోబర్ 16) ప్రారంభమైన ఈ టాస్క్ రెండో రోజు కూడా కొన‌సాగింది. కాక‌పోతే ఇది కాస్త వ‌యోలెన్స్‌గా మారింది. చార్జింగ్ కోసం ఎవరికి వారు బేరాలు ఆడుతూ… గేమ్ ను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా నబిల్‌ రెండోసారి కూడా దెబ్బతిన్నాడు. ఆదమరిచి ఉండటంతో నబిల్ దగ్గర నుంచి అవినాష్‌, తేజ చార్జింగ్ పొందారు.మ‌రోవైపు మణికంఠ నుంచి మోహబూబ్ కూడా చార్జింగ్ కొట్టేశాడు. స్మోకింగ్ అలవాటు ఉండటంతో.. లైటర్‌ను అడ్డు పెట్టుకుని రోహిణి, తేజలు ఛార్జింగ్ పాయింట్లు సంపాదించుకున్నారు.

Advertisement

Bigg Boss 8 Telugu చార్జింగ్ కోసం కొట్లాట‌..

ఓవర్ స్మార్ట్ ఫోన్స్ మీరు సైరన్‌కు సైరన్‌కు మధ్యలో ఛార్జింగ్ పాట్‌ను పగలగొట్టారు. కాబట్టి మీరు ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ నుంచి ఒక సభ్యుడిని కంటెండర్‌షిప్ నుంచి, టాస్క్ నుంచి తప్పించాలి. అది ఎవరో చెప్పండి” అని బిగ్ బాస్ చెప్పాడు.ఆ స‌మ‌యంలో వాష్‌రూమ్‌లోకి వెళ్లిపోయాడు నాగ మణికంఠ. ఆ తర్వాత వెంటనే విష్ణుప్రియ కూడా వెళ్లిపోయింది. ఇది చూసిన రాయల్ క్లాన్ పరిగెత్తుకుని వాష్‌రూమ్స్ దగ్గరికి వెళ్లిపోయారు. వాష్‌రూమ్‌లో ఉన్న మణికంఠ బయటకు రాకుండా కాపల నిల్చున్నారు రాయల్ క్లాన్ సభ్యులు. అప్పుడే మణికంఠ నుంచి బలవంతంగా ఛార్జింగ్ లాగేసేందుకు ట్రై చేశారు రాయల్ క్లాన్. దాంతో బాత్రూమ్ బయట ఉన్న తేజాను పక్కకు లాగాడు నిఖిల్. అది చూసి నిఖిల్‌ను గట్టిగా పట్టుకున్నాడు గౌతమ్. దాంతో ఇద్దరిమధ్య కాసేపు తోపులాట జరిగింది.

Advertisement

Bigg Boss 8 Telugu : వామ్మో.. ఇది బిగ్ బాస్ హౌజా, లేక ఇంకేదైన‌నా.. అలా కొట్టుకుంటున్నారేంటి?

అప్పుడు గౌతమ్‌ను పక్కకి లాగేశాడు నబీల్. మరోవైపు ఈ గొడవలోకి మెహబూబ్‌ను రాకుండా పృథ్వీ ఆపాడు. అప్పుడు ఈ టాస్క్ నుంచి పృథ్వీని తీసేస్తున్నట్లు బిగ్ బాస్‌తో చెప్పారు. మరోవైపు తోపులాటలో గౌతమ్, నిఖిల్ ఇద్దరూ కిందపడిపోయారు. గౌతమ్ చేతులతో గుద్దాడంటూ నబీల్ అన‌గా, దానికి గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. నేను తోయలేదు అని మీదకు వచ్చాడు. అదే సమయంలో నిఖిల్‌ను గౌతమ్ పక్కకు లాగేయడంతో కిందపడ్డాడు నిఖిల్. ఆ కోపంలో నబీల్‌తో వాదిస్తున్న గౌతమ్‌ను వెనుక నుంచి గొంతు పట్టుకుని గార్డెన్ ఏరియాలోకి లాక్కెళ్లిపోయాడు నిఖిల్. దాంతో అంతా నిఖిల్ చేసిన పనికి షాక్ అయ్యారు.ముందు వాడే మూతి మీద కొట్టాడు అంటూ నిఖిల్ చెప్పుకున్నాడు. “నువ్ మాత్రం కావాలనే మెడ పట్టుకుని తీసుకొచ్చావ్, ఇది మా క్లాన్ అని కాదు. సాధారణంగా ఇలా చేయొద్దు” అన్న అర్థంలో రోహిణి చెప్పింది. మొత్తానికి షో అంతా ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.

Advertisement

Recent Posts

Ys Jagan : అలాంటి హామీలు ఇవ్వ‌లేకే సీఎం కాలేక‌పోయానంటున్న జ‌గ‌న్‌.. అయ్యాడుగా మ‌ళ్లీ ట్రోల్ స్ట్రాట్‌..!

Ys Jagan : అజ్ఞానం ఆనందం  కానీ ఎల్లప్పుడూ కాదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కాదు. వారికి, అజ్ఞానం అహంకారంగా…

9 mins ago

Post Office Scheme : ఉత్త‌మ పోస్టాఫీస్ ప‌థ‌కం.. ఒక‌సారి పెట్టుబ‌డితో వ‌డ్డీతో చేతికి రూ.9 వేలు..!

Post Office Scheme : మ‌న‌లో చాలా మంది క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబ‌డి రావాల‌ని కోరుకుంటారు.…

1 hour ago

Money Plant : మనీ ప్లాంట్ మొక్క వేపుగా పెరగాలంటే… ఇలా చేయండి…??

Money Plant : ప్రస్తుత కాలంలో ఎవరి ఇంట్లోనైనా ఈజీగా కనిపించే మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి అని చెప్పొచ్చు.…

2 hours ago

SCERT AP ఖాళీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల‌..!

SCERT AP ఖాళీగా ఉన్న పోస్టులు SAs / HMS, CTE, డైట్‌ లెక్చరర్ల భ‌ర్తీకి డిప్యూటేషన్ ద్వారా భర్తీ…

4 hours ago

BP Control : బీపీని కంట్రోల్ చేయగలిగే ఏకైక ఆకుకూర ఏదో తెలుసా…!!

BP Control : ఆకు కూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే…

5 hours ago

Viral Video : హోమ్ వర్క్ చేయలేదని చావబాదిన టీచర్.. తల్లిదండ్రులు టీచర్ పై కేసు..!

Viral Video : ఈమధ్య కాలంలో పిల్లలను కంట్రోల్ లో పెట్టేందుకు టీచర్స్ తమ హద్ధులు దాటి ప్రవర్తిస్తున్నారు. స్కూల్…

6 hours ago

Diwali : దీపావళి రోజు శనీశ్వరుని పూజిస్తే అన్ని దరిద్రాలు పోయి కోటీశ్వరులవడం ఖాయం…!

Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ…

7 hours ago

Teeth : మీ దంతాలు పసుపు రంగులోకి మారాయా… ఇలా చేస్తే చాలు… తెల్లగా మెరిసిపోతాయ్…!

Teeth  : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన…

8 hours ago

This website uses cookies.