Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో టాస్క్‌లు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్ లో గత రెండు రోజులుగా హొటల్ టాస్కు జరుగుతుంది.ఇందులో మణికంఠతో రోహిణి డ్యాన్స్ చేయించగా.. అంతలోనే కొందరి పాత్రలు మార్చేశాడు బిగ్‌బాస్. తేజ.. రోహిణి, అవినాష్ కు అసిస్టెంట్ అని.. కొడుకు గురించి గర్వంగా ఫీలవుతూ..అతడిని హీరోను చేద్దామని తల్లి పాత్ర హరితేజది. ఇక ఆకతాయి అబ్బాయి కమ్ నయని బాయ్ ఫ్రెండ్ గౌతమ్ అని.. అవినాష్ కు ఎట్రాక్టు అయిన హోటల్ మేనేజర్ ప్రేరణ అని.. హోటల్ ఓనర్ నబీల్ కొడుకు పృథ్వీ అని ఇలా కొందరి పాత్రలు మార్చి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు బిగ్‌బాస్. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో విష్ణు, సీత ఓడిపోగా.. నిఖిల్, మణికంఠ మాత్రమే చివరి వరకు నిలిచారు.
వీరిద్దరికి మరో టాస్కు పెట్టారు. స్విమ్మింగ్ పూల్ లో అక్కడక్కడ వేసిన స్పూన్స్ ఒక్కొక్కటి తెచ్చి పెట్టే టాస్కు పెట్టగా.. ఇందులో నిఖిల్ విజేతగా నిలిచాడు. దీంతో అతడికి స్టార్ ఇచ్చారు. అలాగే మణికంఠ గేమ్ కూడా నచ్చడంతో అతడికి స్టార్ ఇచ్చారు. ఇక గేమ్స్ కంప్లీట్ కాగానే.. పృథ్వీతో సోఫాలో ముచ్చట్లు పెట్టింది విష్ణు. పృథ్వీ ఒడిలో పడుకున్న విష్ణు.. ఈ డబ్బులు తీసుకో.. కానీ నన్ను ప్రేమించు అంటూ ప్రాదేయపడింది. దీంతో పృథ్వీ మాట్లాడుతుండగానే మధ్యలో కల్పించుకుని నీకు నయని నచ్చిందా అంటూ క్వశ్చన్ చేసింది. దీంతో కాసేపు సైలెంట్ అయిన పృథ్వీ ఆ తర్వాత లేదు అని చెప్పాడు.ఇక ఇంటిలో నీటి సరఫరా ఆపేసి రెండు టీంలకు వాటర్ సేకరించే టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఓ చోట నుంచి మరో చోటుకు కింద అడుగుపెట్టకుండా దిగువన ఉన్న కొన్ని వస్తువులపై మాత్రమే నడుస్తూ గ్లాసుతో నీళ్లు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. రెండు క్లాన్స్ నుంచి బాగా కష్టపడినప్పటికీ ఓజీ క్లాన్ సభ్యులు ఇందులో గెలిచారు.
దీంతో వీరికి రూ.25000 గిఫ్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. పూర్తిగా టాస్కు కంప్లీట్ అయిన తర్వాత ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పాలని ఆదేశించాడు బిగ్‌బాస్. రాయల్ క్లాన్ దగ్గర డబ్బులు తక్కువగా ఉండడంతో ఓజీ క్లాన్ దగ్గరకు వెళ్లి అడగ్గా.. దొంగతనం చేశానని సీత చెప్పుకొచ్చింది. దీంతో రెండు టీమ్స్ మధ్య కాసేపు వాదన జరిగింది. సీత బీబీ హోటల్ టాస్క్ ముందు దొంగతనం చేయడంతో.. రాయల్ క్లాన్ సభ్యుల డబ్బులు తక్కువగా వచ్చాయి. దాంతో సీత తను చేసింది ఒప్పుకోక తప్పలేదు. అయితే ఆ డబ్బు ఇవ్వానికి సీత నిరాకరించింది. కాని ఓజి క్లాన్ సభ్యులు, మెగా ఛీఫ్ నబిల్ కూడా ప్రెజర్ చేయడంతో ఆ డబ్బు తిరిగి ఇచ్చేసింది. దాంతో రాయల్ క్లాన్ గెలిచింది. స్ట్రాటజీ ప్రకారం సీత ఆడబ్బు ఇవ్వకుండా ఉంటే.. ఓజీ క్లాన్ గెలిచేవారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.