Yellow Book : ప్రస్తుతం ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులు మొదట్లో కాస్త సైలెంట్ అయినట్టు కనిపించిన ఇప్పుడు వారు కూటమి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు. ఏపీలో రాజకీయ పార్టీలు ప్రత్యర్థులు, అధికారుల కోసం రంగు రంగుల బుక్ లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నారా లోకేశ్… గత ప్రభుత్వ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన అధికారులు, ప్రత్యర్థుల కోసం ‘రెడ్ బుక్’ పెట్టుకున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని, అధికారులను, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా ఓ బుక్ పెడతామని ప్రకటించారు.
రెడ్ బుక్ పెట్టడం పెద్ద పనికాదని, మనం గుడ్ బుక్ పెడదామని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. మధ్యలో రెడ్‌బుక్ ఏమైనా పెద్దపనా? మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అన్యాయంగా వ్యవహరించే వారి పేర్లను, అధికారుల పేర్లను రాసుకుంటున్నారన్నారు. అయితే తాము గుడ్‌బుక్ రాసుకోవడం మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను అందులో రాసుకుంటున్నామన్నారు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ పేరుతో మరో బుక్ తెచ్చారు. అది సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పారు.
ఇలా ఎవరి బుక్ వారికి ఉంటే ఎల్లో మీడియా మరో బుక్ తీస్తోంది. అదే ఎల్లో బుక్. టీడీపీకి అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా ఎల్లో బుక్ లో కూటమి పార్టీలకి చెందిన నాయకుల పేర్లని చేర్చుతుందట. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతీ నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారని తమకు వచ్చిన అపరిమితమైన అధికారాన్ని వాడుకుంటూ వారు దందాలు చేస్తున్నారని, కమిషన్లు దందాలతో హడలెత్తిస్తున్నారు అని , అలా నియోజకవర్గాల స్థాయిలో అవినీతి పెచ్చరిల్లుతోందని కూడా ఫిర్యాదులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఎల్లో మీడియా ఈ తరహా దందా రాయుళ్లను అందరికీ కలిపి ఒక్ లిస్ట్ తయారు చేసి మరీ ఎల్లో బుక్కులో రాస్తోందిట. దీనిని అధినాయకత్వానికి పంపించి వారిపై తగు చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తుందట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.