
Bigg Boss 8 Telugu : సెల్ఫ్‌గా బయటకు వచ్చేసిన నాగ మణికంఠ.. ఎవరిని సేవ్ చేశాడో తెలుసా ?
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఊహించని ట్విస్ట్ లు..అనేక సర్ ప్రైజ్ లతో దూసుకుపోతుంది.ఈ వారం ఊహించని విధంగా మణికంఠ సెల్ఫ్ నామినేషన్ వేసుకొని బయటకు వచ్చాడు. నామినేషన్స్ లో చివరిగా మణింకఠ, గౌతమ్ మాత్రమే మిగిలారు. వారిని యాక్టీవిటీ రూమ్ కు పిలిచారు నాగార్జున. ఇక సరిగ్గా అదేటైమ్ లో ఇంట్లో ఉన్న వారికి మణికంఠ మాట్లాడిన వీడియో ప్లే చేశారు. అందులో మణికంఠ ఆడియన్స్ కు రిక్వెస్ట్ చేసుకున్నది క్లియర్ గా వినిపించింది. తనవల్ల కావడంలేదని.. బయటకి వెళ్ళిపోవాలి అనుకుంటున్నట్టు మణింకఠ తెలిపాడు. మణికంట ఇంట్లో ఉండాలి అని ఎంత మంది అనుకుంటున్నారు. ఉండకూడదు అని ఎవరు అనుకుంటున్నారు అని అందరిని అడిగాడు నాగ్.
దాంతో నయని పావని.. మెహబూబ్, అవినాష్ మాత్రమే మణింకఠ ఉంటేబాగుంటుంది అనుకున్నారు. మిగతా వారు అంతా మణింకఠ వెళ్లిపోతేనే మంచిది అన్నారు. అయితే అవినాష్ అయితే మనస్పూర్తిగా అన్నట్టు అనిపించదు. మణికంఠ బయటకు వెళ్లిపోవాలి కాబట్టి వెళ్తున్నాడు. కాని ఆడియన్స్ డెసిషన్ ఎలా ఉంది అని చూస్తే.. గౌతమ్ రెడ్ జోన్.. మణికంఠ గ్రీన్ జోన్ లో ఉన్నారు. సో మణికి ఓటింగ్ చాలా వచ్చింది. మణి నిర్ణయం వల్ల గౌతమ్ సేవ్ అయ్యి హౌస్ లోకి వచ్చాడు. లేకుంటే ఈ వారం మణికంఠ సేవ్ అయ్యి.. గౌతమ్ బయటకువెళ్లిపోయేవాడేమో. ఇదంతా డిస్కర్షన్ జరుగుతండగానే మరో వైపు అవినాష్ రోహిణి చెవులో గుసగుసలు వినిపించాడు. ఒక వేళ మణిని సీక్రేట్ రూమ్ లో పెడతారేమో అని అన్నాడు.
Bigg Boss 8 Telugu : సెల్ఫ్‌గా బయటకు వచ్చేసిన నాగ మణికంఠ.. ఎవరిని సేవ్ చేశాడో తెలుసా ?
నాగమణికంఠ స్టేజిపైకి వచ్చాక నాగార్జున నీకు ఓట్లు వేసిన వాళ్లకు ఏం చెప్తావు అని అడగ్గా.. నాకు ఓట్లు వేసిన వాళ్లందరికీ సారీ. నేను మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు నా ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. లక్ష్మీదేవి కంటే కూడా ఆరోగ్యమే ముఖ్యం అందుకే వచ్చేసాను అంటూ చెప్పాడు. మరి బిగ్ బాస్ తర్వాత నాగమణికంఠ ఏం చేస్తాడో, ఎలాంటి అవకాశాలు తెచుకుంటాడో చూడాలి. బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో 7 వారాలు ఉన్న నాగ మణికంఠకు సుమారుగా రూ. 8,40,000 రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్స్‌లోని అందరి కంటెస్టెంట్లతో పోల్చుకుంటే నాగ మణికంఠే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్‌లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
This website uses cookies.