Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8లో వారికి త‌ప్ప మిగ‌తా వారంద‌రికి అంత త‌క్కువ రెమ్యున‌రేష‌నా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8లో వారికి త‌ప్ప మిగ‌తా వారంద‌రికి అంత త‌క్కువ రెమ్యున‌రేష‌నా..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 December 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8లో వారికి త‌ప్ప మిగ‌తా వారంద‌రికి అంత త‌క్కువ రెమ్యున‌రేష‌నా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 8 స‌క్సెస్ ఫుల్‌గా ముగిసింది. ప్ర‌తి సీజ‌న్‌కి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అయితే సీజ‌న్ 8 పెద్ద‌గా ఆక‌ట్టుకున్న‌ట్టు క‌నిపించ‌లేదు. అంద‌రు అనుకున్న‌ట్టే ఈ సీరి కన్నడ బ్యాచ్ లీడర్ నే బిగ్ బాస్ విన్నర్ గా చేశారు.. మొదటి నుంచి హౌస్ లో వినిపిస్తున్న రూమర్స్ ను బిగ్ బాస్ నిజం చేశాడని వార్తలు జనాల్లో వినిపిస్తున్నాయి. ఎన్ని అనుకున్నా ఇక బిగ్ బాస్ నిర్ణయం మార్చుకొనే ఛాన్స్ లేదు. విన్నర్ గా నిఖిల్ మరో చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ అతడికి దక్కింది. ఏకంగా రూ 55 లక్షల ప్రైజ్ మనీ నిఖిల్ సొంతం అయింది.

Bigg Boss 8 Telugu వారికి మ‌రీ త‌క్కువ‌..

14 మంది ముందుగా హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా ఎనిమిది మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దాంతో బిగ్ బాస్ రెండు గ్రూప్ లుగా డివైడ్ చేసి ఆటలు ఆడించారు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లో నిఖిల్, గౌతమ్ పోటీ పడ్డారు. అయితే గౌతమ్ ఫైర్ చూసి అతనే విన్నర్ అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే హౌజ్‌లోకి వ‌చ్చిన ఒక్కొక్క‌రి రెమ్యున‌రేష‌న్ గురించి తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవ్వ‌డం ఖాయం. ముందుగా ఎలిమినేట్ అయిన బెజవాడ బేబక్క రెమ్యూనరేషన్ 1,75,000 రూపాయిలు. రెండు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శేఖ‌ర్ భాషా 4,30,000 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.అభయ్ నవీన్ మూడు వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆయన 6 ,30,000 రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. నాలుగు వారాలు హౌస్ లో ఉన్న సోనియా 8,50,000 రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఆదిత్య ఓం మ‌రియు నైనికా ఇద్ద‌రు 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఒకరు, వీకెండ్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. 5 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఆదిత్య 12,50,000 రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఇక అదే వారం లో ఎలిమినేట్ అయినా నైనికా 9 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంది. ఆరు వారాలు హౌస్ లో ఉన్నందుకు సీత‌ 9 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ,మ‌ణికంఠ‌ 11 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

Bigg Boss 8 Telugu బిగ్ బాస్ సీజ‌న్ 8లో వారికి త‌ప్ప మిగ‌తా వారంద‌రికి అంత త‌క్కువ రెమ్యున‌రేష‌నా

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8లో వారికి త‌ప్ప మిగ‌తా వారంద‌రికి అంత త‌క్కువ రెమ్యున‌రేష‌నా..!

మెహబూబ్ & నయనీ పావని 8 వ వారంలో ఒకరు, 9వ వారంలో మరొకరు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. రెండు వారాలు హౌస్ లో ఉన్నందుకు మెహ‌బూబ్ 7 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. మూడు వారాలు ఉన్నందుకు న‌య‌ని పావ‌ని 7 లక్షల రూపాయిలను తీసుకుంది. గంగవ్వ మ‌రియు హరితేజ నాలుగు వారాలు హౌస్ లో ఉన్నందుకు గంగ‌వ్వ‌ 11 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంది. గంగవ్వ కూడా 5 వారాలు ఉన్నందుకు ఈమె 9 లక్షల రెమ్యూనరేషన్ ని అందుకుంది. యష్మీ 12 వారాలు హౌస్ లో ఉన్నందుకు ఈమె 30 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. పృథ్వీ, ఏకంగా 11 వారాలు నామినేషన్స్ లోకి వచ్చి, 13 వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ 28 లక్షల రూపాయిలు. రోహిణి & విష్ణు ప్రియా డబుల్ ఎలిమినేషన్ అయ్యారు. రోహిణి 8 వారాలు హౌస్ లో ఉన్నందుకు 22 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. అదే వారం లో టాప్ 6 స్థానంలో ఎలిమినేట్ అయిన విష్ణు ప్రియ 42 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది.నబీల్, అవినాష్ ల‌లో 28 లక్షలు నబీల్ తీసుకోగా, అవినాష్ 32 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. ప్రేరణ 37 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఇక 10 వారాలు హౌస్ లో ఉన్నందుకు గౌతమ్ 21 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. bigg boss 8 telugu contestants remuneration list viral

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది