Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 రాను రాను రసవత్తరంగా మారుతుంది. షోలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. మెగా చీఫ్ కంటెండర్స్ చివరి రౌండ్ జరగగా, ఈ ఫైనల్ రౌండ్ లో అవినాష్, నబీల్, ప్రేరణ, నిఖిల్ ఉండగా.. అవినాష్ టాస్క్ గెలిచి బిగ్ బాస్ ఇంటి తదుపరి మెగా చీఫ్ గా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ దీపావళి సందర్భంగా హౌస్ మేట్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వీడియోలను చూపించారు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ను చూడడంతో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ రియాల్టీ షో లో ఎనిమిది వారాల్లో ఏకంగా తొమ్మిది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు.
బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక తొమ్మిదో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, యష్మి, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో ఉండగా, ఆన్‌లైన్ ఓటింగ్ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. ఓటింగ్ క్షణాలలో తారుమారు అయింది.వీరిలో 36.73 శాతం ఓటింగ్, 5,782 ఓట్లతో గౌతమ్ టాప్‌లోకి ఎగబాగితే.. 27.78 శాతం ఓటింగ్, 4,373 ఓట్లతో యష్మీ రెండో స్థానానికి పడిపోయింది.
ఇక మొన్నటి వరకు డేంజర్ జోన్‌లో అది కూడా ఐదో స్థానంలో ఆఖరున ఉన్న నయని పావని ఒక్కసారిగా మూడో స్థానంలోకి రాకెట్‌లా దూసుకొచ్చింది. ఆమెకు 2,308 ఓట్లతో 14.66 శాతం ఓటింగ్ నమోదు అయింది.టేస్టీ తేజ నాలుగో స్థానానికి పడిపోయాడు. ఆఖరి స్థానంలో 1,451 ఓట్లతో, 9.22 శాతం ఓటింగ్‌తో హరితేజ నిలిచింది. దీంతో డేంజర్ జోన్‌లో ఇప్పుడు టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. మొన్నటి వరకు హరితేజ, నయని పావని ఉండేవారు. కానీ, ఒక్కసారిగా ఓటింగ్ లెక్కలు తారుమారు అయ్యాయి. టేస్టీ తేజ బిగ్ బాస్ కు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్, ఫన్ కంటెంట్ ఇస్తున్నాడు. వీరితో పోలిస్తే హరితేజ మాత్రం అంతంతమాత్రంగానే టాస్కులు ఆడుతున్నారు. కాబట్టి ఆమె బయటకు వెళ్లడం ఖాయంగా అనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది.
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
Telangana : తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
This website uses cookies.